డిసెంబర్ 15 వరకు కొత్త జాబ్ వెతుక్కోండి.. టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్!
ప్రముఖ జర్మన్ స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం 'అడిడాస్' భారత విభాగంలో భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న తమ ఇండియా టెక్నాలజీ హబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు గురువారం ఊహించని షాక్ తగిలింది. మంగళవారం నిర్వహించిన ఓ అర్జెంట్ టౌన్‌హాల్ సమావేశంలో ఈ ప్రక్రియ గురించి కంపెనీ ప్రతినిధులు ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆపరేషన్లను మరింత సులభతరం చేయడం, వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడంలో భాగంగానే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు అడిడాస్ సంస్థ ధ్రువీకరించింది.
టెక్నాలజీ బృందంలో దాదాపు 350 మందికి పైగా ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడిందని, ఇది మొత్తం టెక్ సిబ్బందిలో 45 నుంచి 50 శాతం వరకు ఉంటుందని సమాచారం. అయితే కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మాత్రం తమ ఇండియా టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లో కేవలం 20 శాతం కంటే తక్కువ మందిపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రభావితమైన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు ప్రధానంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ లేఆఫ్స్ ప్రక్రియలో భాగంగా ప్రభావితమైన ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి బృందానికి సెప్టెంబర్ 15నే నేరుగా తొలగింపు లేఖలను అందజేశారు. ఇక రెండో బృందానికి డిసెంబర్ 15 వరకు కంపెనీలో కొనసాగడానికి గడువు ఇచ్చారు. ఈ సమయంలో వారు ఇతర టెక్ హబ్‌లలోని సహచరులకు తమ బాధ్యతలను హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిసెంబర్ 15 నాటికి కంపెనీలోనే వేరే ఇతర పదవిని పొందేందుకు లేదా కొత్త జాబ్ వెతుక్కోవడానికి సమయం ఇచ్చారు. ఆ తేదీ నాటికి వేరే ఉద్యోగం లభించకపోతే.. అదే వారికి చివరి వర్కింగ్ డే అవుతుందని స్పష్టం చేశారు.
దీనిపై అడిడాస్ స్పందిస్తూ.. "వేగంగా మారుతున్న టెక్నాలజీ, వ్యాపార వాతావరణంలో సుదీర్ఘకాలం విజయవంతంగా కొనసాగేందుకు తమ నిర్వాహక నమూనాను మార్చుకోవడం తప్పనిసరి అయింది. ఎఫెక్ట్ అయ్యే ఉద్యోగాలకు సహకారాన్ని అందిస్తాం" అని వెల్లడించింది. ఎంతమంది ఉద్యోగులు తొలగిస్తున్నారనే ఖచ్చితమైన సంఖ్యను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఇండియా తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఇండియా టెక్ హబ్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుందని తెలిపింది.














Click it and Unblock the Notifications
