రోజు ఇవి రెండు రెబ్బలు తింటే..గుండె సేఫ్- బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్..!!
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి మానవళికి శాపంగా మారాయి. ఒక చిట్కాతో స్ట్రోక్ కు దూరం గా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి బ్రహ్మ పదార్థాలు అక్కర్లేదని, నిత్యం వంటింట్లో కనిపించే వెల్లుల్లితోనే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందు లో ఉండే అల్లిసిన్ అనే క్రియాశీలక పదార్థం ఉంటుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. లిపిడ్ ప్రొఫైల్స్, గ్లైసెమిక్ ఇండెక్స్, రక్తపోటు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి వాటిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడ డంలో వెల్లుల్లి ఎంతో దోహదపడుతుంది.
వెల్లుల్లి తీసుకుంటే రక్తపోటును.. కొలెస్ట్రాల్ నియంత్రణకు సహకరిస్తుంది. అదే విధంగా గుండె నాళాల్లో రక్త ప్రసరణ సులభంగా జరిగేలా చూడటంతో పాటుగా పలు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వెల్లుల్లి అనారోగ్య సమస్యలను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. గుండె మొత్తం పనితీరును మెరుగుపరచడంలో వెల్లుల్లి మనకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె పనితీరు మెరుగుపడడంతో పాటు గుండె కండరాలు బలంగా తయారవుతాయి.

నిపుణుల సూచనలు
వెల్లుల్లి వినియోగం పైనా పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వెల్లుల్లితో మేధస్సు పెరుగు తుంది. కంఠస్వరం మెరుగవుతుంది. రాత్రి పూట వెల్లుల్లి తీసుకోవడం రక్తపోటు (బీపీ) ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో కూడా తోడ్పడుతుంది. రాత్రి సమయంలో గుండెపై ఒత్తిడి తక్కువగా ఉండే సమయంలో వెల్లుల్లి ప్రభావం చూపి, గుండె ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
