నా మీదే ఫిర్యాదు చేస్తారా? తాట తీస్తా..! టీడీపీ మహిళా ఎమ్మెల్యే వార్నింగ్..!

రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష (Miriyala Sirisha) ఇవాళ తమ సొంత పార్టీ నాయకుల మీదే మండిపడ్డారు. నియోజకవర్గంలో ఏమాత్రం పట్టులేని, ప్రజలతో సంబంధాలు లేని నాయకులు, తన మీద పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తారా అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యోగులు తనతో ఫొటోలు దిగితే పార్టీల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో అక్కడే ఉన్న క్యాడర్ అంతా షాకయ్యారు.

కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!
కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం అలా చేయొద్దు..! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు..!

పార్టీ ఆఫీసుకు వెళ్లి ఒక వర్గానికే చూస్తున్నారు, వైసీపీ వాళ్లకు ఇచ్చేశారని చెప్తారా మీరు.. తాట తీసేస్తాను ఎవరికైనా.. పని చేయరు, ఓట్లు వేయించలేరు, తిరిగి కష్టపడరు.. పార్టీ కార్యక్రమాలు చేయరు. మళ్లీ ఎమ్మెల్యే గారి మీద బురదజల్లుతారా మీరు అంటూ ఎమ్మెల్యే మిరియాల శిరీష మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఎవరో ఉద్యోగులు వస్తుంటారు, నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఫొటో తీసుకుంటారు, మర్యాదగా ఉంటుంది కాబట్టి స్టేటస్ పెట్టుకుంటారన్నారు. అ ఫొటోల స్క్రీన్ షాట్ తీసి ఒకడు సచివాలయ ఉద్యోగి ఎమ్మెల్యేతో తిరుగుతున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తారా అని ప్రశ్నించారు.

TDP MLA Miriyala Sirisha Warns Cadre Against Complaining to Party High Command
FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!
FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలకు క్యాడర్ అడ్డు తగిలారు. వారిని వెంటనే కూర్చో.. పిచ్చి పిచ్చి డ్రామాలేస్తున్నారా అంటూ మిరియాల శిరీష మండిపడ్డారు. చోడవరంలో ఒక్క కార్యక్రమం ఉందంటే, ఒక్కడూ ఒక్క మనిషిని తీసుకురారని, ఒక పది మందిని వెనుకాల తీసుకు రారని, కమిటీలో స్ధానాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఏ మండలానికీ లేని విధంగా అడ్డతీగలకు 15 కోట్లు తాను తీసుకువచ్చానని ఎమ్మెల్యే మిరియాల శిరీష గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+