చంద్రశేఖరన్ పై టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం..! ఒంటరైన నోయల్ టాటా ?
దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) వచ్చే ఫిబ్రవరితో ముగుస్తున్న తన పదవీకాలం తర్వాత తిరిగి ఆ పదవి కోరబోనంటూ గత నెలలో చేసిన ప్రకటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన టాటా సన్స్ బోర్డు.. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆయన రెండో దఫా పదవీకాలం ముగిసిన తర్వాత , మరో ఐదేళ్ల పాటు ఆయనే బోర్డు ఛైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. చంద్రశేఖరన్ ఎంపిక సందర్భంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని ఐదేళ్లపాటు పొడిగించేందుకు బోర్డు ఇవాళ ఆమోదం తెలిపింది. సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం.. ఇవాళ టాటా సన్స్ బోర్డు ఛైర్మన్ ఎంపిక కోసం జరిగిన ఓటింగ్ లో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ మరియు టాటా సన్స్ బోర్డు సభ్యుడైన నోయెల్ టాటా మాత్రమే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగతా సభ్యులంతా ఆమోదం తెలపడంతో చంద్రశేఖరన్ కు మరో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్టు నిర్ణయాన్ని ఏజీఎంలో ర్యాటిఫై చేయాల్సి ఉంది. మరోవైపు నోయల్ టాటా వ్యతిరేకిస్తున్న లిస్టింగ్ కు వెళ్లాలనే నిర్ణయానికి కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది.

వాస్తవానికి చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది.అయితే మరోసారి ఛైర్మన్ పదవికి పోటీ పడబోనంటూ చంద్రశేఖరన్ గత నెలలో తేల్చిచెప్పేశారు. ఈ మేరకు బోర్డుకు కూడా సమాచారం ఇచ్చేశారు. కానీ 63 ఏళ్ల చంద్రశేఖరన్ అనుభవం, సంస్థతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని, మరోమారు ఆయనకు అవకాశం కల్పించాలని బోర్డులో మెజార్టీ సభ్యులు భావించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నిర్ణయానికి ముందు, కంపెనీ నియంత్రణపరమైన విధానంపై వేరే అంచనాలతో తీసుకున్న తన రాజీనామా నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా నామినేషన్ , పారితోషిక కమిటీ 63 ఏళ్ల చంద్రశేఖరన్‌ను కోరనుంది.
మరోవైపు టాటా గ్రూప్ కంపెనీ లిస్టింగ్ ను వ్యతిరేకిస్తున్న నోయెల్ టాటా.. చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపుకు మద్దతివ్వడానికి దీన్ని కూడా ఓ షరతుగా పెట్టారని గతంలో వార్తలొచ్చాయి. మరోవైపు టాటా సన్స్‌లో సుమారు 18 శాతం వాటా కలిగి ఉన్న నోయెల్ టాటా మామ గారి కంపెనీ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం టాటా గ్రూప్ లిస్టింగ్‌కు అనుకూలంగా ఉంది.














Click it and Unblock the Notifications
