ముద్ర యోజనతో 58 కోట్ల సామాన్యుల జీవితాలపై బలమైన ముద్ర వేసిన ప్రధాని మోడీ

సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోడీ 76వ జన్మదినం. ఈ రోజున కేవలం ఆయన పుట్టిన రోజు వేడుకగా కాకుండా సేవా సంకల్ప అభియాన్ రూపంలో ప్రజాసేవకు అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం నుండి పీఎంగా ఎదిగి ప్రజల జీవితాలలో సామాన్యుల జీవితాలలో సంతోషం నింపడానికి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రధాని మోదీ పట్ల సామాన్య ప్రజలలో అభిమానాన్ని పెంచుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన పథకాలు సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాయి. అటువంటి పథకాలలో ముద్ర యోజన ఒకటి. ముద్ర యోజన.. 2015లో చిన్న వ్యాపారులు, మహిళలు, యువతకు ఎటువంటి గ్యారెంటీ అవసరం లేకుండా సులభంగా రుణాలు అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు లబ్ధిని పొంది తమ జీవితాలను మార్చుకున్నారు.

Modi Cabinet Reshuffle: మోడీ కేబినెట్ ప్రక్షాళనకు తాజా ముహుర్తం..! ఆర్ధికమంత్రిగా ఊహించని వ్యక్తి..!
Modi Cabinet Reshuffle: మోడీ కేబినెట్ ప్రక్షాళనకు తాజా ముహుర్తం..! ఆర్ధికమంత్రిగా ఊహించని వ్యక్తి..!
PM Modi PMMY PM Modi s profound impact on the lives of 58 crore common people through Mudra Yojana

అధికారిక గణాంకాల ప్రకారం మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా 58 కోట్లమందికి రుణాలు మంజూరు కాగా 40 .07 లక్షల కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయి. ఇందులో మూడింట రెండు వంతులు మహిళలకే దక్కాయి. శిశు, కిషోర, తరుణ్ వర్గాలలో రుణాలు అందిస్తుండగా, ప్రస్తుతం తరుణ్ ప్లస్ వర్గంలో కూడా రుణాలు ఇస్తున్నారు.

శిశు రుణాలలో 50వేల వరకు, కిషోర్ రుణాలలో 50 వేల నుండి 5 లక్షల వరకు ఇస్తారు ఇక తరుణ్ లో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు, తరుణ్ ప్లస్ లో 10 లక్షల నుండి 20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విషయానికొస్తే ముద్ర యోజన ద్వారా జనవరి 2026 నాటికి 1.13 కోట్ల రుణాలు మంజూరు కాగా, 1.36 లక్షల కోట్లు పంపిణీ అయ్యాయి.

BRICS Summit: పాశ్చాత్యదేశాలకు మోడీ క్లారిటీ..! బ్రిక్స్ వ్యతిరేకతకు దూరంగా..!
BRICS Summit: పాశ్చాత్యదేశాలకు మోడీ క్లారిటీ..! బ్రిక్స్ వ్యతిరేకతకు దూరంగా..!

ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 86. 10లక్షల రుణాలు మంజూరు కాగా, 86 వేల 354 కోట్లు లబ్ధిదారులకు అందాయి. ఈ రుణాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కుటీర పరిశ్రమలను నిర్వహించుకునే వారికి, సేవ రంగాలలో పనిచేసే వారికి ఆర్థికంగా భరోసా ఇచ్చింది. ముద్ర యోజన పథకం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు పెట్టుబడుల కోసం బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే అవసరం లేకుండా చేశాయి.

సామాన్య, మధ్య తరగతి కుటుంబాల అభ్యున్నతికి దోహదం చేశాయి. తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి ముద్ర రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఆలంబనగా నిలుస్తున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలతో ముద్ర యోజన పథకం ద్వారా బలమైన ముద్ర వేసి వారి జీవితాలలో వెలుగులు నింపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+