మహేష్ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్..! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఇక టాలెంటెడ్ సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వారణాసి మూవీని దుర్గాఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత కే. ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
వారణాసి మూవీలో మహేష్ బాబు రుద్ర అనే పాత్ర చేస్తున్నారు. రుద్ర అనే పేరు వినగానే ఆగ్రహం, ఆవేశం, శక్తి, రౌద్రం వంటి లక్షణాలు గుర్తుకొస్తాయని అందుకు తగినట్లుగానే మహేష్ బాబు క్యారెక్టర్ ఉంటుందని ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అలాగే గత నెలలో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ ఒత్తైన జుట్టు, గడ్డం, మీసాలతో రగ్గడ్ లుక్ లో మహేష్ ఆకట్టుకుంటున్నారు. అలాగే వారణాసి మూవీలో శ్రీ రాముడి పాత్రలోనూ కనువిందు చేయనున్నారు మహేష్ బాబు. ఇక వారణాసి తర్వాత మహేష్ బాబు సినిమాపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తారని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా టైటిల్ డెవిల్ అని కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అలాగే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ మహేష్ బాబు సినిమా ఉంటుందని సమాచారం. దీనిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చేరారు. మహేష్ బాబు- సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు భన్సాలీ. దేవదాస్, బ్లాక్, సావారియా, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, గంగూబాయ్ కతియావాడీ లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
