‘కాకా’ మూవీలో మెగాస్టార్ సరసన అలనాటి హీరోయిన్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా 'కాకా' ప్రచార చిత్రాలు, అప్‌డేట్స్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నటీనటుల ఎంపికకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ సీనియర్ నటి స్నేహ ఈ ప్రాజెక్టులో ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని.. ముఖ్యంగా చిరంజీవి పాత్ర కోసం చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రధాని మోదీ 15 ఏళ్ల వయసులో చూసిన సినిమా!
ప్రధాని మోదీ 15 ఏళ్ల వయసులో చూసిన సినిమా!

గతంలో పలు వేదికలపై నటి స్నేహ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కనీసం ఒక సినిమా అయినా చేయాలని.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అంటూ ఆకాంక్షించారు. ఒకవేళ ఈ రూమర్ నిజమైతే దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఆమె ఏళ్ల నాటి కల నెరవేరబోతోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాల్లో హోమ్లీ నటనతో మెప్పించిన స్నేహ.. చిరంజీవికి జోడీగా నటిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుగు సినిమా వర్గాలు భావిస్తున్నాయి.

Actress Sneha to Play Key Role in Megastar Chiranjeevi Kaaka Movie exciting casting buzz in Tollywood

అయితే ఈ పాత్రకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ లేదా చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చిరంజీవి భార్యగా స్నేహ నటిస్తున్నారనే వార్త ప్రస్తుతానికి పుకారుగానే ఉన్నప్పటికీ.. ఈ కాంబినేషన్ వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి 'కాకా సినిమాపై బజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకవేళ స్నేహ ఆ పాత్రను పోషిస్తే.. ఆ క్యారెక్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.

డిజాస్టర్ కా బాప్ దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా..? ఇంత నమ్మకం ఏంటి అన్నా..?
డిజాస్టర్ కా బాప్ దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా..? ఇంత నమ్మకం ఏంటి అన్నా..?

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. ఇప్పటికే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు తేదీని కూడా ఖరారు చేశారు. స్నేహ ఎంట్రీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉండగా.. ఈ క్రేజీ కాస్టింగ్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+