ప్రధాని మోడీ పుట్టిన రోజున హీరో రామ్ చరణ్ కీలక ప్రకటన!

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం నేడు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రముఖులు మోడీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. నేటి నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.

మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ 'సేవా సంకల్ప్ అభియాన్'లో తాను భాగమవుతున్నట్లు ప్రకటించారు. సమాజానికి తనవంతు సాయంగా రాబోయే నెలల్లో 1,000 మంది మహిళలకు ఉచితంగా ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. రామ్ చరణ్ ఈ ప్రకటన చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రంగంలో ఉన్నప్పటికీ సామాజిక సేవలో కూడా చురుకుగా పాల్గొంటున్నారని అభిమానులు, ప్రముఖులు కొనియాడుతున్నారు.

Ram Charan Seva Sankalp Abhiyan free skill development training to 1 000 women pledge on modi birthday

మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి స్వావలంబనకు దోహదం చేస్తానని హీరో రామ్ చరణ్.పేర్కొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం, 76వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రామ్ చరణ్ తన వంతు సహకారంగా మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ శిక్షణ ద్వారా మహిళలు వివిధ నైపుణ్యాలు నేర్చుకుని స్వంతంగా ఉపాధి సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. రామ్ చరణ్ ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వివిధ సేవా కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. కానీ ఈసారి మోదీ జన్మదినం సందర్భంగా తీసుకున్న నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

వరంగల్ కేంద్రంగా సైబర్ ముఠా..దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు!
వరంగల్ కేంద్రంగా సైబర్ ముఠా..దేశవ్యాప్తంగా 185 సైబర్ నేరాలతో లింకులు!

అభిమానులు, సామాజిక కార్యకర్తలు రామ్ చరణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మహిళా సాధికారతకు ఇలాంటి చర్యలు ఎంతో అవసరమని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ శిక్షణ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారో వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ ప్రకటన సామాజిక సేవా రంగంలో కొత్త చర్చను రేకెత్తించింది. ఇదే సమయంలో రాజకీయ రంగంలోనూ కొత్త చర్చకు కారణం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+