ఈ అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి 'ఇరుముడి'.. ఆ ఒక్క అడుగు దూరంలో బ్లాక్ బస్టర్ మూవీ..!
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ఇరుముడి.. విడుదలైన దగ్గర్నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. రవితేజ గత సినిమాలు అయిన మాస్ జాతర, భర్త మహాశయులకి విజ్ఞప్తి, ఈగల్, మిస్టర్ బచ్చన్ తదితర సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో రవితేజ ఎలాంటి ఆడంబరాలకు పోకుండా సింపుల్ స్టోరీలైన్ కు సస్పెన్స్ యాడ్ చేసి పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఇరుముడి మూవీ తెలుగు చలనచిత్ర సీమలో సంచలన రికార్డులను నమోదు చేసింది.
ఇరుముడి సినిమా ప్రారంభమైనప్పుడు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ మూవీ నుంచి టీజర్, సాంగ్స్, పోస్టర్లు, ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై బజ్ పెరిగింది. అలా రిలీజ్ కు ముందే ఇరుముడి సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక మూవీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తోనే సినిమా దూసుకెళ్తోంది. 25 రోజులుగా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన సినిమా మరొకటి లేదనే చెప్పాలి.
ఇక ఇరుముడి మూవీ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడి సినిమా ప్రభంజనం కొనసాగింది. రిలీజ్ అయిన దగ్గర్నుంచి రోజూ రూ. కోటికి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు మరో సంచలన రికార్డును చేరుకునేందుకు ఇరుముడి మూవీ ఒక్క అడుగు దూరంలోనే ఉంది. అదేంటి అంటే..? ఈ మూవీ రూ. 250 కోట్ల మార్కును చేరుకునేందుకు అతి చేరువలో ఉంది. ఈ మార్క్ ను దాటాలంటే మూవీ మరింత దూకుడును చూపించాల్సి ఉంటుంది.

మరోవైపు ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఇరుముడి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. సెప్టెంబర్ 18 శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర కీలకపాత్ర పోషించింది. ఇక ఈ మూవీలో సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి మూవీ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి..












Click it and Unblock the Notifications
