ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!

టైటిల్‌తోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన 'పాంచాలి పంచభర్తృక' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ పృధ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

లెఫ్టినెంట్ కల్నల్‌ గా వెంకటేశ్.. అనిల్ రావిపూడి మూవీ క్రేజీ పోస్టర్ రిలీజ్..
లెఫ్టినెంట్ కల్నల్‌ గా వెంకటేశ్.. అనిల్ రావిపూడి మూవీ క్రేజీ పోస్టర్ రిలీజ్..

కథ
డాక్టర్ దమయంతిని డాన్సన్ మనుషులు కిడ్నాప్ చేసి, తమ వ్యాపారానికి సహకరించాలని బెదిరించడంతో కథ ప్రారంభమవుతుంది. మరోవైపు, సీరియల్ తీసే చిత్తరంజన్ , అద్దె ఇంటి కోసం వెతికే కాట్‌రాజ్, పుష్పరాజ్‌లు ఒకే పెంట్ హౌస్‌ను షేర్ చేసుకుంటారు. అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ బాబ్జీని బురిడీ కొటించి నలుగురూ ఒకటవుతారు. ఒకరోజు ఆన్‌లైన్ ద్వారా సెనోరిటా అనే అమ్మాయిని రూమ్‌కి పిలిపిస్తారు. కానీ ఊహించని విధంగా ఆమె రక్తపు మడుగులో శవమై కనిపిస్తుంది. కంగారుపడి ఆ శవాన్ని సూట్‌కేసులో దాస్తే... ఆ సూట్‌కేసే మాయమవుతుంది. అసలు ఆ సూట్‌కేస్ ఏమైంది? పరమసుందరిగా రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏమిటి? సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలు ఏం చేశాడు? అసలు సెనోరిటాని చంపిందెవరు? అనేది మిగతా కథ.

Panchali Panchabhartruka Movie Review Telugu A Hilarious and Gripping Suspense Thriller

ఎలా ఉందంటే?
కమెడియన్ సునీల్ వాయిస్ ఓవర్‌తో పాత్రల పరిచయం చాలా వెరైటీగా, వినోదాత్మకంగా సాగుతుంది. పాత్రల పేర్లు, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటాయి. మర్డర్ మిస్టరీ మొదలయ్యాక కథలో వేగం పుంజుకుంటుంది. మర్డర్ ఎవరు చేశారనే సస్పెన్స్‌ను చివరి వరకు గెస్ చేయలేనంత గ్రిప్పింగ్‌గా నడిపించారు. వరుసగా విప్పే చిక్కుముడులు, క్లైమాక్స్ ముందు వచ్చే రెండు ఊహించని ట్విస్ట్‌లు సినిమాకు ప్రధాన బలం. కంగారు పుట్టించే సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌కి, ఎక్కడా క్రింజ్ అనిపించని ఫ్రెష్ కామెడీని జత చేసి ఎంగేజింగ్‌గా మలచడంలో దర్శకుడు విజయం సాధించారు.

Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?

రాజేంద్ర ప్రసాద్ , పృధ్వీ తమ మార్కు కామెడీ టైమింగ్ , అనుభవంతో సినిమాను ముందుండి నడిపించారు. జెమిని సురేష్‌కి మంచి ప్రాధాన్యమున్న పాత్ర దక్కగా, రోల్ రైడాకు లభించిన ఫుల్ లెంగ్త్ రోల్ సినిమాకు ప్లస్ అయ్యింది. కీలక పాత్రలో నటించి, కొత్తవాడైనా ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచారు. దర్శకుడు గంగా సప్తశిఖర స్వయంగా సీక్రెట్ ఏజెంట్ ఏడుకొండలుగా నటించి నవ్వులు పూయించారు. గంగా సప్తశిఖర ప్రెజెంటేషన్ చాలా బాగుంది. కొత్త దర్శకుడైనా సీనియర్ మాదిరిగా ప్రతి పాత్రనూ బాగా తీర్చిదిద్దారు. టైటిల్ సాంగ్ అదరగొట్టగా, సిట్యువేషనల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అనవసరమైన సాగదీతలు లేకుండా ఎడిటింగ్ కచ్చితత్వంతో సాగింది. నిర్మాతల అభిరుచి ప్రొడక్షన్ వాల్యూస్ , మ్యూజిక్ సెలక్షన్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్లు
గ్రిప్పింగ్ కథ, స్క్రీన్‌ప్లే, రాజేంద్ర ప్రసాద్, పృధ్వీ నటన
ఆకట్టుకునే సంగీతం & బిజిఎమ్
క్లైమాక్స్ ట్విస్ట్‌లు

మైనస్ పాయింట్లు
కథ అక్కడక్కడ సాగదీత
ప్రమోషన్ చేయకపోవడం

ఫైనల్‌గా
పాంచాలి పంచభర్తృక - నవ్వులతో పాటు కట్టిపడేసే సస్పెన్స్ థ్రిల్లర్‌ను కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఎలాంటి బోర్ కొట్టకుండా సాగే ఈ కామెడీ మిస్టరీ రైడ్‌ను థియేటర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

*రేటింగ్: 2.75/3

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+