TTD: తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా ‘నందకం’ యాప్..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. శ్రావణ మాసం తో పాటుగా వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నెలలో తిరుమలలో రెండు సార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. అదే విధంగా రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సమస్యల పరిష్కారినికి మరో యాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
తిరుమలలో వచ్చే నెల 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భక్తులకు వసతి.. దర్శనం తో పాటుగా సౌకర్యాల కల్పన పైన కీలక అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందు లో భాగంగా సమీక్ష చేసారు. తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్స్, ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు.

బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
అదే విధంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా 'నందకం' యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్‌టైమ్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుమల లో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్ నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్‌పాత్, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలని సూచించారు.













Click it and Unblock the Notifications