'గ్లోబల్ లీడర్'గా భారత్: ఎర్రకోటపై ప్రధాని మోదీ ధీమా!
PM Modi: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటు నుంచి వరుసగా 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, దృఢ సంకల్పంతోనే దేశం ఈనాడు వివిధ రంగాల్లో ప్రగతి శిఖరాలను అధిరోహిస్తుందని.. ఈ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడిన భారత్.. గత 12 ఏళ్ల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించాలనే మన దృఢ సంకల్పం తప్పక నెరవేరుతుందని ఈ విజయాలు నిరూపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

గత 12 ఏళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూ, దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు, ఖాదీ-గ్రామోద్యోగ్ ఉత్పత్తి 5 రెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. అదేవిధంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 శాతం పెరగగా.. డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 శాతం వృద్ధి చెందాయని ప్రధాని గణాంకాలతో సహా వివరించారు.
పైప్ లైన్ ద్వారా తాగునీటి సరఫరా, గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా సాధారణ పౌరుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని ప్రధాని మోదీ వెల్లడించారు. 21వ శతాబ్ధంలో వేగంగా ముందుకు సాగుతున్న భారత్ గత శతాబ్ధపు పాత చట్టాలపై ఆధారపడి నడవలేదని.. అందుకే నిరంతర సంస్కరణలు, చట్టపరమైన మార్పులు అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇండియాకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ గత దశాబ్దాల్లో కావాల్సినంత వేగాన్ని అందుకోలేకపోయిందని ప్రస్తావిస్తూ.. గత 12 ఏళ్లలో చారిత్రాత్మక మార్పులు సాధ్యమయ్యాయని అన్నారు. 140 కోట్ల భారతీయుల భాగస్వామ్యంతో 'వికసిత భారత్' కల సాకారమవడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications