కేబినెట్ మార్పులపై తేల్చేయబోతున్న మోడీ..! మంత్రులతో 2 రోజుల కీలక భేటీ..!

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల తర్వాత జాతీయ స్దాయిలో చోటు చేసుకున్న పరిణామాలు, మార్పుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై రెండు రోజుల సమీక్షకు ప్రధాని మోడీ (PM Modi)సిద్దమయ్యారు. చింతన్ శివిర్ పేరుతో ఇవాళ, రేపు ఢిల్లీలోని సేవాతీర్ధ్ లో జరిగే ఈ భేటీలో కేబినెట్ మంత్రులతో ప్రధాని సుదీర్ఘంగా భేటీ కాబోతున్నారు. పైకి సంస్కరణలపై చర్చ, వికసిత్ భారత్ పై నిర్ణయాలు అని చెప్తున్నా.. అంతిమంగా మంత్రుల పనితీరును సమీక్షించి, ఎవరెవరిని కేబినెట్ లో ఉంచాలి, ఎవరిని తప్పించాలన్నదీ తేల్చేయనున్నారు.

మోడీ-షా విభేదాలు? రాజీనామాకు సీనియర్ల నో..! కేబినెట్ ప్రక్షాళన ఆలస్యం వెనుక?
మోడీ-షా విభేదాలు? రాజీనామాకు సీనియర్ల నో..! కేబినెట్ ప్రక్షాళన ఆలస్యం వెనుక?

సంస్కరణల అమలు, వికసిత్ భారత్-2047 ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించి,, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చింతన్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అలాగే జాతీయ స్దాయిలో తాజా రాజకీయ పరిణామాలు, మంత్రుల పనితీరు సమీక్ష, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వ ప్రాధాన్యతలు మార్చుకోవడంపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజన్-2047 స్వల్పకాలిక, దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి రంగాల వారీగా 10 కార్యదర్శుల బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ.. వాటిపై ఇవాళ మరోసారి ప్రజంటేషన్లు తీసుకునే అవకాశం ఉంది.

PM Modi Chairs Two-Day Chintan Shivir With Cabinet Ministers Amid Reshuffle Buzz
బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?
బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?

అలాగే జంతర్ మంతర్ ఆందోళనల తర్వాత మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కోరుతున్నారు. అంతే కాదు వీటిపైనా నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాను కూడా స్వయంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరును ప్రధాని కొలవబోతున్నారు. అలాగే దీంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని చింతన్ శిబిర్ లు కూడా ఏర్పాటు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఇవన్నీ అంతిమంగా కేబినెట్ లో మార్పులపై మంత్రుల్లో వస్తున్న వ్యతిరేకతను వాడుకుంటూ ప్రక్షాళనకు ప్రధాని దారులు తెరుస్తారనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే త్వరలో చేపట్టే కేబినెట్ ప్రక్షాళనపై చింతన్ శిబిర్ రిపోర్టుల ప్రభావం కూడా ఉండబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+