జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!

ఏపీలో శాసనమండలి విపక్ష నేత, వైసీపీ సీనియర్ నేత కూడా అయిన బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష (Botsa Anusha ) ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగనమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను, ఆయన కుమార్తె సిరి సహస్ర అనూహ్యంగా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్దం పుచ్చుకున్న నేపథ్యంలో బొత్స కుమార్తె అనూషకు భీమిలి అసెంబ్లీ ఇన్ చార్జ్ గా జగన్ (YS Jagan) బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో బొత్స అనూష ఇవాళ తాడేపల్లికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు.

జగన్ తో భేటీ-పొత్తు ? తేల్చేసిన షర్మిల..! అంత ఖర్మ పట్టలేదు..!
జగన్ తో భేటీ-పొత్తు ? తేల్చేసిన షర్మిల..! అంత ఖర్మ పట్టలేదు..!

గతంలో భీమిలి అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా ఉన్న మజ్జి శ్రీను రాజీనామా చేయడంతో ఆయన స్ధానంలో ఇటీవలే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషకు వైఎస్సార్‌సీపీ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచీ నియోజకవర్గంలో చురుగ్గా సమావేశాలు నిర్వహిస్తూ అనూష యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇవాళ.. జగన్‌ను కలిశారు. తనపై నమ్మకం ఉంచి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Botsa Anusha Meets YS Jagan After Being Appointed Bheemili Assembly In-Charge
హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..! రాజీనామా లీకుల వేళ- తేల్చేశారా ?
హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..! రాజీనామా లీకుల వేళ- తేల్చేశారా ?

ఈ సందర్బంగా బొత్స అనూషకు వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతంపై కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీని వీడి పోయిన మజ్జి శ్రీనుకు కౌంటర్ గా అనుసరించాల్సిన వ్యూహాలపై అనూషకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై బొత్స అనూషకు జగన్‌ పలు సూచనలు చేశారు. జగన్ తో భేటీ తర్వాత బయటికి వచ్చిన అనూష... భీమిలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. భీమిలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+