వైసీపీ శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!

ఏపీలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ఇవాళ వైఎస్సార్సీపీ (YSRCP ) నాయకులు విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ స్టేడియం ప్రాంగణంలో ఉన్న శాప్ కార్యాలయాన్ని (Vijayawada SAAP Office) ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకోవడంతో ఈ ప్రయత్నం విఫలమైంది. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాప్ ఆఫీసు ఘటనల్లో బాధ్యుల్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం మన భ్రమ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ గారి దుర్బుద్ధి బయటపడిందన్నారు. జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారన్నారు.

YSRCP Protest at Vijayawada SAAP Office AP Govt Orders CCTV Footage Review to Identify Culprits

క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగిందని లోకేష్ ఆరోపించారు. రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టిందన్నారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలి. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచుల పనిపడతామని వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు ప్రభుత్వం (AP Govt) కూడా పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. విజయవాడలో టీచర్లపై దాడి చేసిన వారిని వదలొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ నేతలు, రౌడీషీటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు పంపింది. దీంతో ఇవాళ శాప్ కార్యాలయం వద్ద దాడిలో పాల్గొన్న వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తిస్తున్నారు. అనంతరం వీరికి నోటీసులు పంపి విచారణకు పిలిపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+