మళ్లీ వైసీపీలోకి మజ్జి శ్రీను? ఎప్పుడో బయటపెట్టిన టీడీపీ ఆస్థాన సర్వేయర్..!

ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణకు కూటమి సర్కార్ సిద్ధమవుతున్న వేళ విపక్ష వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు, రైట్ హ్యాండ్ కూడా అయిన మజ్జి శ్రీనివాసరావు (Majji Srinvivasarao) అలియాస్ చిన్న శ్రీను తిరిగి సొంత పార్టీకి వెళ్లిపోతారా ? అందుకు ముహుర్తం కూడా సిద్దం చేసుకున్నారా ? టీడీపీలో చేరింది తాత్కాలిక ప్రయోజనాల కోసమేనా ? అంటే అవుననే సమాధానం క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తోంది. దీన్ని తాజాగా టీడీపీ ఆస్థాన సర్వే నిపుణుడు ఒకాయన నిర్దారించారు.

టీడీపీలో చేరిపోయిన బొత్స మేనల్లుడు..! చంద్రబాబు కీలక హామీ?
టీడీపీలో చేరిపోయిన బొత్స మేనల్లుడు..! చంద్రబాబు కీలక హామీ?

చిన్న శ్రీను టీడీపీలో చేరడం వైఎస్సార్సీపీకి షాక్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అనుకూల సర్వే నిపుణుడిగా, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారని పేరున్న రైజ్ సంస్ధ అధినేత ప్రవీణ్ పుల్లట కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న శ్రీను పార్టీ మార్పు ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ కాదు, షేక్ కాదు అంటూ ఆయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఏపీ మొత్తం సంగతి ఎలా ఉన్నా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో దగ్గరి నుంచి గమనించే వ్యక్తి, స్ధానికుడు కూడా అయిన ప్రవీణ్ పుల్లట చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు టీడీపీ, వైసీపీల్లో చర్చనీయాంశమవుతోంది.

Will Majji Srinivasarao Return to YSRCP Pro-TDP Survey Expert Makes Key Prediction
మజ్జి శ్రీను జంప్ వెనుక సీటును మించి ఆ రెండు ! అందుకేనా బొత్స మామకు హ్యాండ్ ?
మజ్జి శ్రీను జంప్ వెనుక సీటును మించి ఆ రెండు ! అందుకేనా బొత్స మామకు హ్యాండ్ ?

చిన్ని శ్రీను పార్టీ మార్పుపై స్పందిస్తూ.. ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోవడం సంగతి ఎలా ఉన్నా వచ్చే ఏడాది జరిగే జగన్ పాదయాత్రలో ఆయన తిరిగి చేరకుండా చూసుకుంటే మంచిది అంటూ టీడీపీ అధిష్టానానికి సంకేతాలు ఇచ్చారు. తన అభిప్రాయం ప్రాకంర చిన్న శ్రీను చేరిక టీడీపీకి శుభ సంకేతం కాదని ప్రవీణ్ పుల్లట తేల్చిచెప్పేశారు. దీంతో చిన్న శ్రీను రాజకీయం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా టీడీపీలో చేరి, ఆ పార్టీని ఉత్తరాంధ్రలో బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్న చిన్న శ్రీనుపై ప్రవీణ్ పుల్లట అభిప్రాయాన్ని ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+