స్థానిక ఎన్నికల ముహూర్తం ఫిక్స్,కూటమి సీట్ల షేరింగ్ - మంత్రులకు బిగ్ టాస్క్..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. కూటమి పార్టీలు కొద్ది రోజులుగా ఈ ఎన్నికల పైన కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ సైతం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు స్థానిక ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసారు. వైసీపీ ఎన్నికల నిర్వహణను సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆపాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కాగా.. ప్రభుత్వం ఎన్నికల పైన నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం సీట్ల సర్దుబాటు పై సమన్వయ కమిటీ సమావేశం కానుంది. మంత్రులకు బిగ్ టాస్క్ అప్పగించారు.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ కు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అందులో భాగంగా ఈ సాయంత్రం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పార్టీ సీనియర్లను ఆహ్వానించారు. వారికి ఎన్నిక ల పైనా సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. అదే విధంగా సాయంత్రం పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీల నేతలు హాజు కానున్నారు. స్థానిక ఎన్నికలు.. సీట్ల సర్దుబాటు పైన చర్చించనున్నారు. కాగా.. కేబినెట్ సమావేశం కు ముందు మంత్రులతో లోకేష్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అందులో స్థానిక ఎన్నికల పైన స్పష్టత ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నెల నుంచి దశల వారీగా కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రి లోకేశ్ అన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించు కుంటూ కొత్త ఫించన్లు ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

మంత్రులకు దిశా నిర్దేశం
అదే విధంగా స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధమవ్వాలని.. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలన్నారు. అక్టోబర్‌లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని..ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టు పెండింగ్‌లో ఉన్నవి కూడా త్వరితగతిన పరిష్కరించుకుని అన్నింటిలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. తొలుత పురపాలిక లు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అన్ని కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకుని అనుకున్న సమయానికి ఎన్నికలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. విద్యా శాఖను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు పన్నుతున్న కుట్రల పట్ల తనతో పాటు సంబంధిత మంత్రులూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ మంత్రులకు నిర్దేశించారు. విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంక్షేమ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టాలని సూచించారు.













Click it and Unblock the Notifications