"ప్రజల నుంచి ఓటు వేసే హక్కునూ దొంగిలించారు.. అతనే నిజమైన దేశద్రోహి"

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్, దేశంలోని విద్యావ్యవస్థలో సంస్కరణలతో పాటు ప్రజా సమస్యలపై ఈ పార్టీ తనదైన శైలిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR​)లో భాగంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపుపై అంశంపై తాజాగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ లక్ష్యంగా సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజంలో మార్పు కోరుకునేందుకు ప్రజల వద్ద ఉన్న ఏకైక ఆయుధం ఓటు.. ఆ ఓటును దొంగిలించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ నిజమైన దేశ ద్రోహి అని సంచలన ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియ అసలైతే ముగ్గురు ఎన్నికల కమిషనర్ల పర్యవేక్షణలో జరగాలని కానీ ఎలక్షన్ కమిషన్ లోని ముగ్గురు కమిషనర్లలో ఇద్దరైన సుఖ్‌ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల సిఫార్సులను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని ఇటీవల ఓ ప్రముఖ వార్తా పత్రిక సంచలన కథనాన్ని వెల్లడించింది. అయితే ఈ వార్తా కథనాన్ని ఆధారంగా చేసుకుని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక ఆరోపణలు గుప్పించారు. ఇట్స్ టైమ్ ఫ్రెండ్స్.. ఇట్స్ టైమ్.. జ్ఞానేశ్‌ కుమార్‌ ఇక చాలు బ్రదర్ అంటూ ఎక్స్ మాధ్యమంలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. యువత ఓట్ చోరీ అంశంపై మాట్లాడాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే మనం భారత్ ను మార్చలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేశారు.

" ఫ్రెండ్స్.. చాలా ట్రెర్రిబుల్ న్యూస్ ను అందించేందుకు వచ్చాను. ఈ ఘోరమైన రిపోర్టును ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈరోజు ప్రచురించింది. జస్ట్ ఓ సారి వెళ్లి చూడండి. అందులో కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురించి వివరించింది. ప్రస్తుతం మనం విద్య వ్యవస్థపై పోరాటం చేస్తున్నాం.. స్కూల్స్ తిరుగుతున్నాం.. మౌలిక సదుపాయాలపై పోరాటం చేస్తున్నాం. మార్పు కోసమే మనమంతా ఈ పోరాటం చేస్తున్నాం. ఈ అవినీతి, బ్రోకెన్ వ్యవస్థ వెళ్లిపోవాలి. కొత్త ఆలోచనలు ఉన్న యువత ముందుకు రావాలి. వ్యవస్థ మారాల్సి ఉంది. కానీ ఇందులో ఏదీ సాధ్యం కాదు.. ఎందుకంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ కాంప్రమైజ్ అయింది. అందుకే మన ఓట్లను అది దొంగిలిస్తోంది.

మనం ఓటు వేసే హక్కును కూడా కాలరాస్తోంది. మీకు తెలిసిందే.. సమాజంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే మొదటగా ఎన్నికలు, ఓటు ద్వారానే సాధ్యం.. కానీ ఓట్లను దొంగిలిస్తే సమాజంలో మార్పు ఎలా సాధ్యం అవుతుంది. మనం ఇలాంటి కార్యక్రమాలను ఎన్ని చేసినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ రిపోర్టునే ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఈరోజు ప్రచురించింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ కోట్లమంది ఓట్లను దోచుకున్నారు. ఉదాహరణకు బెంగాల్ ఎన్నికలు తీసుకుందాం.. ఎన్నికలకు ముందు బెంగాల్ లో కోట్ల మంది ఓట్లను ఈసీ తొలగించింది. చొరబాటుదారులనే తాము తొలగించామని ఈసీ చెబుతోంది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలగించిన వారిలో 91 శాతం మంది ఓట్లను ఓటర్ లిస్టుల్లో పునరుద్ధరించారు. ఒకవేళ బెంగాల్ ఎన్నికల్లో వాళ్లు ఓటు వేస్తే పరిస్థితులు వేరే విధంగా ఉండేవి. ఒక్కో నియోజకవర్గంలో వేయి ఓట్లు కూడా పెద్ద మార్పును తీసుకొస్తాయి.

SauravDas makes key allegations against CEC Gyanesh Kumar stealing the right to vote for change

ఇదే జరిగితే బెంగాల్ లో వేరే ప్రభుత్వం అధికారంలో ఉండేది. అది ప్రజలు కోరుకున్న ప్రభుత్వమే ఉండేది. కానీ దాన్ని దోచుకున్నారు. మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ ఇదే.. ప్లీజ్ ఈసీ గురించి మాట్లాడండి. మనం నిరుద్యోగిత, మౌలిక సదుపాయాల కొరత, పేపర్ లీక్స్.. అన్నింటినీ భరిస్తున్నాం. కానీ ఇవేమీ మారవు.. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ఇవి మారతాయి. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ లాంటి వాళ్లను తొలగిస్తేనే న్యాయం జరుగుతుంది. వీళ్లు దేశానికి వ్యతిరేకంగా నేరాలు చేస్తున్నారు. ఇట్స్ ఏ వేకప్ కాల్.. ప్లీజ్ ఈసీ పై మాట్లాడండి.. అని యువతకు ఎమోషనల్ అప్పీల్ చేశారు సౌరవ్ దాస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+