ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్..! సోషల్ ఇన్ ఫ్లూయన్సర్లకు నెలకు 15 వేలు, ఐడీ కార్డు..!

ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల (Social Media Influencer) ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల ఎంప్యానెల్‌మెంట్ కోసం రూపొందించిన పాలసీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలో ప్రత్యేక యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి, వివరాలను వెరిఫై చేసిన అనంతరం అర్హత కలిగిన వారికి ID కార్డులను జారీ చేయనున్నారు.

ఏపీలో 4 కొత్త పోలీసు కమిషనరేట్లు- అమరావతి రైతుల కౌలు సవరణ-కేబినెట్ కీలక నిర్ణయాలు..!
ఏపీలో 4 కొత్త పోలీసు కమిషనరేట్లు- అమరావతి రైతుల కౌలు సవరణ-కేబినెట్ కీలక నిర్ణయాలు..!

అలాగే, ఇన్‌ఫ్లుయెన్సర్ల కేటగిరీ, రీచ్, పనితీరు తదితర ప్రమాణాల ఆధారంగా వివిధ కేటగిరీలను రూపొందించి, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేసే విధానానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా, సమర్థవంతంగా చేరవేయనున్నారు.

AP Cabinet Clears Social Media Influencer Policy Monthly Payments Up to 15 000
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!
జగన్ ను కలిసిన బొత్స అనూష..! మజ్జి శ్రీనుకు కౌంటర్ స్ట్రాటజీ ఖరారు..!

తాజా విధానం ప్రకారం రాష్ట్రంలో విశ్వసనీయమైన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను గుర్తించి ధ్రువీకరించే విధానం అమలు చేయనున్నారు. ప్రభుత్వ సమాచార ప్రచారానికి నిబంధనలతో కూడిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ పాలసీ రూపకల్పన జరగనుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వీడియోలు, పోస్టులకు వ్యూస్, ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కేటగిరీల విభజన జరగనుంది. వీటి ఆధారంగానే వారికి నెలవారీ చెల్లింపులు చేయబోతున్నారు.

-కేటగిరీల వారీగా నెలవారీ చెల్లించే మొత్తాలు-

కేటగిరీ ఏ - లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు గరిష్ఠంగా రూ.15,000

కేటగిరీ బీ - 50,000 నుంచి 99,999 ఫాలోవర్లకు రూ.7,500

కేటగిరీ సీ - 25,000 నుంచి 49,999 ఫాలోవర్లకు రూ.5,000

కేటగిరీ డీ - 10,000 నుంచి 24,999 ఫాలోవర్లకు రూ.2,500

ప్రతి వీడియో ప్రచారానికి నిబంధనలు, షరతులు వర్తించేలా విధానం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+