"కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో తెలుసా?"- 4 రాష్ట్రాల్లో జీరో తర్వాత మోడీ పంచ్..!

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్, ఎన్నికల అక్రమాల మీద జాతీయ స్దాయిలో పోరాటాలకు నేతృత్వం వహిస్తున్న విపక్ష కాంగ్రెస్ పార్టీ.. తాజాగా పలు రాష్టాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. ముఖ్యంగా నాలుగు పెద్ద రాష్ట్రాలు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్నాటకలో 28 సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేక జీరోకు పరిమితం కావడం చర్చనీయాంశంగా మారింది. అందులోనూ అధికారంలో ఉన్న కర్నాటకలో సైతం ఒక్క సీటు కూడా గెల్చుకోలేక నాలుగు చోట్ల బీజేపీ-జేడీఎస్ చేతిలో ఓటమిపాలవ్వడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.

మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!
మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!

ఈ నేపథ్యంలో జాతీయ స్ధాయిలో తమపై పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద రాష్టాల్లో, అదీ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంపై ప్రధాని మోడీ (PM Modi) స్పందించారు. ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో దీనిపై వ్యంగాస్త్రాలు సంధించారు. 4 పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటకలలోని 28 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికలు జరిగాయని, అందులో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి? అంటూ ఓ ఎమోజీ పెట్టి మోడీ ట్వీట్ చేశారు.

PM Modi Mocks Congress After Party Wins Zero Seats in 28 MLC Bypolls Across Four States
మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!
మోడీ చాణక్యం..! ఓ మంత్రి రాజీనామాతో ఖాళీ అయిన బెర్తు మరో కేంద్రమంత్రికి..!

తాజాగా ఎమ్మెల్సీ ఉపఎన్నికలు జరిగిన కర్నాటకలో బీజేపీ-జేడీఎస్ కూటమి నాలుగు సీట్లను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో బీజేపీ మూడు, జేడీఎస్ ఓ సీటు గెల్చుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ రెండు సీట్లను, బీజేపీ ఐదు సీట్లను గెల్చుకున్నాయి. బీహార్ లో బీజేపీ, ఆర్జేడీ, జన్ సురాజ్, ఇండిపెండెంట్ ఒక్కో సీటు గెల్చుకున్నారు. మహారాష్ట్రలో అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ నడుస్తున్నా అందులో కాంగ్రెస్ లేదు. దీంతో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు గెల్చుకుందంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. తద్వారా తనపై జాతీయస్ధాయిలో కాంగ్రెస్ పోరాటాలు చేస్తున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం తన హవానే కొనసాగుతుందని చెప్పకనే చెప్పినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+