బెంగళూరు ఎమ్మెల్సీ లో కాంగ్రెస్ భారీ ఓటమి: మిగిలిన చోట్లా బీజేపీ-జేడీఎస్ క్లీన్ స్వీప్

కర్ణాటక శాసనమండలి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఏ ఒక్క దాంట్లో కూడా గెలవలేకపోయింది. భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) కూటమి విజయఢంకా మోగించింది. కూటమి అభ్యర్థులు మూడుచోట్ల ఘన విజయం సాధించగా.. మరో స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు అందుకున్న తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడం, చుక్కెదురు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీచర్స్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు ఇవి. బెంగళూరు, ఈశాన్య టీచర్స్, పశ్చిమ, ఆగ్నేయ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికలు ఇవి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. బ్యాలెట్ పేపర్లను లెక్కించాల్సి రావడం వల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం చోటు చేసుకుంది. రాత్రి సమాయానికి అందిన సమాచారం ప్రకారం.. మూడు నియోజకవర్గాల్లో బీజేపీ-జేడీఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. మరో చోట ఆధిక్యతలో ఉన్నారు.

BJP-JDS swept all 4 seats in the Karnataka MLC elections Wins 3 and Huge leading in an another One
  • బెంగళూరు టీచర్స్ స్థానంలో బీజేపీ-జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ ఘన విజయం సాధించారు. ఆయనకు 10,810 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణకు 9,902 ఓట్లు పడ్డాయి. మొత్తం 908 ఓట్ల తేడాతో రంగనాథ్ ఇక్కడ గెలుపొందారు.
  • ఈశాన్య టీచర్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శశీల్ జీ నమోషీ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు మొత్తం 15, 596 ఓట్లు పడగా.. ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ కు చెందిన శరణప్ప మట్టూర్ కు 12, 299 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి శశీల్ ఎన్నిక కావడం వరుసగా ఇది అయిదోసారి. ఈ నియోజకవర్గంపై ఆయనకు ఉన్న గట్టి పట్టుకు ఈ ఎన్నిక అద్దం పట్టినట్టయింది.
  • పశ్చిమ గ్రాడ్యుయేట్స్ సీటులో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. బీజేపీకి చెందిన ఎస్ వీ సంకెనూర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ కు చెందిన మోహన్ లింబికాయిని 24,388 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. సంకెనూర్ కు మొత్తం 33,711 ఓట్ల పడ్డాయి. మోహన్ కు పోల్ అయిన ఓట్లు 9,323 మాత్రమే.
  • ఆగ్నేయ గ్రాడ్యుయేట్స్ స్థానం ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీకి చెందిన కేఎం సురేష్.. 18,356 ఓట్ల తేడాతో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శశి హులికుంటెమఠ వెనుకంజలో ఉన్నారు.
తెలంగాణ సీనియర్ ఐఎఎస్ జయేష్ రంజన్.. అనూహ్య నిర్ణయం
తెలంగాణ సీనియర్ ఐఎఎస్ జయేష్ రంజన్.. అనూహ్య నిర్ణయం

ఈ ఎన్నికలను డీకే శివకుమార్ ప్రభుత్వానికి రెఫరెండంగా భావిస్తోంది.. ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమి. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమిపాలు కావడాన్ని ఎత్తి చూపుతోంది. ఈవీఎంలను మేనేజ్ చేశామంటూ కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణల్లో అర్థం లేదని కొట్టిపారేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వెలువడుతాయని ఆశిస్తోంది. ఈ ఫలితాలు కాంగ్రెస్ ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. వీటిని పునఃసమీక్షించుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+