మోడీ కంచుకోట బద్దలు-వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ బిగ్ షాక్..!
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాని మోడీ వరుసగా గెలుస్తూ వస్తున్న ఎంపీ సీటు వారణాసి పరిధిలో తాజాగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ .. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారణాసి పరిధిలో కాషాయ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. వారణాసి పరిధిలోని రెండు ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు ఇవాళ అధికారికంగా యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (UP MLC Results) ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన 11 సీట్లకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో.. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ కీలక విజయాలు అందుకుంది. ఇక్కడ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. వారణాసి టీచర్స్ ఎమ్మెల్సీ సీటును సమాజ్వాదీ పార్టీ మరోసారి నిలబెట్టుకోగా.. కొత్తగా
వారణాసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటులో నిర్ణయాత్మక విజయం దిశగా పయనిస్తోంది. దీంతో వారణాసిని ఎస్పీ క్లీన్ స్వీప్ చేయబోతోంది.

రాష్ట్రంలో 11 సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఆరు స్ధానాలు కైవసం చేసుకున్నా ప్రధాని మోడీ సీటు వారణాసి పరిధిలో మాత్రం రెండు సీట్లు ఓడిపోయింది. సమాజ్ వాదీ పార్టీ మాత్రం వారణాసిలో రెండు ఎమ్మెల్సీ సీట్లు గెల్చుకోవడంతో పాటు
ఆగ్రా టీచర్స్ ఎమ్మెల్సీ సీటును కూడా గెల్చుకుంది. బీజేపీ లక్నో, మీరట్-సహారన్పూర్, బరేలీ-మొరాదాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ సీట్లతో పాటు మీరట్-సహారన్పూర్ పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు మరో స్థానాన్ని కూడా గెల్చుకుంది. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న వేళ వెలువడిన ఈ ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ మార్పుకు సంకేతంగా నిలుస్తున్నాయి.
వారణాసిలో రెండు విజయాలతో ఊపు మీదున్న ఎస్సీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటుకుంటామని చెబుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో వారణాసి సీటులో కాంగ్రెస్ అభ్యర్ది అజయ్ రాయ్ పై కేవలం లక్షన్నర ఓట్ల తేడాతో గెలిచి ప్రధాని మోడీ బయటపడ్డారు.














Click it and Unblock the Notifications
