అమెరికా-చైనా స్పేస్ వార్ లో బిగ్ టర్న్-పెంటగాన్ కంటపడిన డ్రాగన్ సీక్రెట్ ప్లేన్..!

అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలైన అమెరికా-చైనా (US-China) ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా బహిరంగంగా ఉపగ్రహాలను పంపుకోవడం, అంతరిక్ష ప్రయోగాలు చేసుకోవడం, వీటితో పాటు రహస్య పరికరాలను కూడా తీసుకెళ్లి అక్కడ ఉంచే కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా చైనా పంపిన రహస్య విమానం ఒక దాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ మధ్య గుర్తించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను కూడా తీసింది. దాన్ని తాజాగా పెరుగుతున్న అంతరిక్ష ముప్పు పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీంతో అగ్రరాజ్యం ఒక్కసారిగా షాక్ అయింది.

భారత్ నిర్ణయం వెనుక అమెరికా బెదిరింపులు? ట్రంప్ మంత్రి క్లారిటీ..!
భారత్ నిర్ణయం వెనుక అమెరికా బెదిరింపులు? ట్రంప్ మంత్రి క్లారిటీ..!

పెంటగాన్ తాజాగా విడుదల చేసిన 2026 అంతరిక్ష ముప్పు అంచనా నివేదికలో, మాక్సర్ ఉపగ్రహం ద్వారా కక్ష్యలో ఉన్న చైనా యొక్క రహస్య షెన్‌లాంగ్ స్పేస్‌ప్లేన్ చిత్రాన్ని ప్రచురించింది. ఇది తిరిగి వినియోగించే అవకాశం కలిగిన మానవరహిత అంతరిక్ష నౌక. అమెరికా సైన్యం యొక్క ఎక్స్-37బీ మాదిరిగానే, ఒక రాకెట్ ద్వారా ప్రయోగించబడి, ఒక రన్‌వేపై భూమికి తిరిగి వస్తుంది.
చైనా 2020 నుండి నాలుగు అంతరిక్ష మిషన్లను నిర్వహించి, అంతరిక్షంలోని ఇతర వస్తువుల సమీపంలో మోహరించగల, విన్యాసాలు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఇప్పుడు ఈ షెన్ లాంగ్ స్పేస్ ప్లేన్.. ఉపగ్రహ తనిఖీ, సమీప కార్యకలాపాల కోసం ఉపయోగించే సాంకేతికతలు, ఉపగ్రహ వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పెంటగాన్ నివేదిక హెచ్చరించింది.

China s Shenlong Spaceplane Pentagon Reveals Satellite Image and Warns of Anti-Satellite Risks

2024లో మాక్సర్ టెక్నాలజీస్ అనే జియోస్పేస్ ఇంటెలిజెన్స్ సంస్థ తీసిన ఈ ఫోటో 'అంతరిక్ష భద్రతకు సవాళ్లు' అనే పెంటగాన్ తాజా నివేదికలో పొందుపర్చారు. 130 పేజీల ఈ ముప్పు అంచనా నివేదిక, ప్రస్తుతం అమెరికా, దాని మిత్రదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతరిక్ష ముప్పును గుర్తుచేస్తోంది. చైనా అధికారికంగా దీని ఉనికిని వెల్లడించిన దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉందంటే ఈ ప్రాజెక్టు ఎంత రహస్యంగా సాగుతోందో అర్దం చేసుకోవచ్చు. 2020లో చైనా తన మొట్టమొదటి స్పేస్‌ప్లేన్ నమూనాను ప్రయోగించింది, అది భూమికి తిరిగి రాకముందు 2 రోజుల పాటు కక్ష్యలో ఉందని పెంటగాన్ 'ఇన్‌సైడ్ ఔటర్ స్పేస్' తెలిపింది. ఆగష్టు 2022లో చైనా చేపట్టిన రెండవ స్పేస్‌ప్లేన్ మిషన్ 276 రోజుల పాటు కక్ష్యలో ఉంది. ఆ స్పేస్‌ప్లేన్ ఒక ఉపగ్రహానికి 100 మీటర్ల సమీపంలో కనిపించిందని నివేదిక తెలిపింది.

China s Shenlong Spaceplane Pentagon Reveals Satellite Image and Warns of Anti-Satellite Risks
సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు-డీల్ కూడా లెక్కచేయని హూతీలు..!
సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులు-డీల్ కూడా లెక్కచేయని హూతీలు..!

2023 డిసెంబర్ 14 నుంచి 2024 సెప్టెంబర్ 6 వరకు కొనసాగిన మూడో మిషన్‌లో, చైనా స్పేస్‌ప్లేన్ అనేక చిన్న వస్తువులను కక్ష్యలోకి విడుదల చేయడం గమనించారు. ఆ పేలోడ్‌లు ఏంటో ఇప్పటికీ తెలియలేదు. చివరిగా 2026న ఏప్రిల్ 7న చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించిన తర్వాత, ఈ రహస్య స్పేస్‌ప్లేన్ నాల్గవ యాత్రలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఇది అమెరికా స్పేస్ ఫోర్స్ సొంత రహస్య రోబోట్ విమానం ఎక్స్ -37బీ తరహాలో ఉంది. బోయింగ్ రూపొందించిన ఈ పునర్వినియోగ వాహనం, తన ఎనిమిదవ రహస్య మిషన్‌లో భాగంగా భూమికి సమీప కక్ష్యలో 431 రోజులుగా గడుపుతోంది. ఇది 2010లో తొలిసారిగా కక్ష్యలోకి చేరుకుంది. అక్కడి నుంచి ప్రస్తుతం తన ఎనిమిదవ మిషన్‌ను కొనసాగిస్తోంది. దీనిని గత ఆగస్టులో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ పై నుండి ప్రయోగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+