ర్యాంకింగ్స్‌లో అభిషేక్ రచ్చ, ఇషాన్ ను పడగొట్టి - అరుదైన ఘనత..!!
టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించారు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించారు. తన సహచర ఆటగాడు, సహచర ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను వెనక్కినెట్టి అభిషేక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. తాజాగా చేసిన ఫాస్టెస్ట్ సెంచరీతో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. మళ్లీ అగ్రస్థానంలోకి దూసూకురావటం తో ఐసీసీ ర్యాంకుల్లోనూ తన సత్తా ఏంటో నిరూపించాడు.
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అభిషేక్ శర్మకు ఈ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ దక్కింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 113 పరుగు లతో అభిషేక్ క్రికెట్ ఫ్యాన్స్ ను మురిపించాడు. యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకు న్నాడు. ఆ అద్భుతమైన ప్రదర్శన అభిషేక్ స్థానం పెంచేసింది. తిరిగి తొలి స్థానం చేరుకోవటానికి కారణమైంది. ఈ మ్యాచ్ తరువాత తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 897 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్ 883 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అభిషేక్ తొలి స్థానంలోకి రావటం తో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ 866 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.

న్యూజీలాండ్ సిరీస్ లో గాయం కారణంగా కిషన్ ఒక్క మ్యాచ్‌నే ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఈ ప్రభావంతో అతడి ర్యాంక్ మూడో స్థానానికి పడిపోయింది. టీ20 టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయిదు స్థానాలు కోల్పోయి 758 పాయింట్లతో 9వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. టీంలోని ఇతర ప్లేయర్లు కూడా ఈసారి ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలను సాధించారు. భారత వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ ఆరు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు.
న్యూజిలాండ్ హిట్టర్ ఫిన్ అలెన్ 25వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో యాన్సెన్ టెస్టు బౌలింగ్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. టెస్టుల్లో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఉన్న భారత స్టార్ రవీంద్ర జడేజాను వెనక్కినెట్టి జాన్సెన్ ఈ స్థానంలో నిలిచాడు.బౌలింగ్ విభాగంలో భారత్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానాన్ని దక్కించుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న 7వ స్థానానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
