సోషల్ మీడియాలో కవిత పార్టీ దూకుడు.. కీలక మార్పులు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉన్నాయి. పార్టీల మధ్య డిజిటల్ పరంగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో జెన్ జీ యువతను ఆకట్టుకునేందుకు పార్టీలు సోషల్ మీడియా ఖాతాలు ఇమ్మడిముమ్మడిగా పుట్టుకొస్తున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇతర పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతూ అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో కీలక మార్పులను చేసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
తాజాగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో వివిధ విభాగాలకు సంబంధించి రాష్ట్రస్థాయి నాయకులను నియమించారు కల్వకుంట్ల కవిత. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన సోషల్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్ గా ఆకాశ్ కొల్లూరు నియామకం అయ్యారు. పార్టీని డిజిటల్, సోషల్ మీడియాలో మరింత బలోపేతం చేసే యోచనలో భాగంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మాజీ సీనియర్ జర్నలిస్ట్, జాతీయ అధికార ప్రతినిధి ఆకాశ్ కొల్లూరును టీఆర్ఎస్ సోషల్ అండ్ డిజిటల్ మీడియా అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆయనతోపాటు టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా సందీప్ బొల్లంపల్లి, స్టేట్ జాయింట్ సెక్రటరీలుగా కొలకాని మనోహర్, తేజ చౌదరీ, కవిత మేరు, నిషా పాలే నియామకం అయ్యారు.

ఇక ఆకాశ్ కొల్లూరు గతంలో ఇండియా టూడే, సీఎన్ఎస్-18, రిపబ్లిక్ టీవీ, డైలీ హంట్ తదితర సంస్థల్లో పనిచేశారు. అంతకుముందు ఇన్వెస్టిగేటీవ్ జర్నలిజంలో 15 మేజర్ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. గతేడాది తెలంగాణ రక్షణ సేన పార్టీలో ఆయన చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ సోషల్ అండ్ డిజిటల్ మీడియా అధ్యక్షుడిగా నియామకం అయ్యారు.












Click it and Unblock the Notifications
