కోటి రికార్డు అందుకున్న టీడీపీ..! గొప్ప మైలురాయి అన్న లోకేష్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. అంతకంటే ముందే మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇంత క్షిష్టమైన దశలో ప్రజలకు చేరువయ్యేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేష్ రూపొందించిన ఇంటింటికీ తెలుగుదేశం (Intintiki Telugu Desam) కార్యక్రమం విజయవంతంగా దూసుకుపోతోంది. అంతే కాదు ఇప్పటివరకూ కోటి ఇళ్లను చేరుకున్న రికార్డు కూడా అందుకుంది.

దీనిపై నారా లోకేష్ (Nara Lokesh) సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించిందని లోకేష్ తెలిపారు. "ఇంటింటికీ తెలుగుదేశం-2026" కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Nara Lokesh Applauds Intintiki Telugu Desam as Outreach Drive Crosses One-Crore Households

ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుందని లోకేష్ వెల్లడించారు. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారి కుటుంబాలను చేరుకోవడంతో పాటు వాటిని అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని సరి చేసే ప్రయత్న ంచేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+