టీడీపీ కుప్పం రివేంజ్, పులివెందుల 'అష్టదిగ్బంధనం'- జగన్ అభ్యర్ధి ఫిక్స్..బిగ్ ఫైట్.!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్నాయి. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. కూటమి నేతలు ఏకపక్షంగా విజయం సాధించటం పైనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ సైతం తన మార్క్ నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. కాగా.. పులివెందుల పైన టీడీపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. ఇటు జగన్ తమ అభ్యర్ధిని ఫిక్స్ చేసారు. దీంతో.. ఇక్కడ పోరు ఆసక్తిగా మారుతోంది.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం ఎక్కడా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. కూటమి సీట్ల ఖరారు లోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మాజీ సీఎం జగన్ తాజాగా పార్టీ నేతలకు స్థానిక ఎన్నికలకు దిశా నిర్దేశం చేసారు. ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ కు సీటు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో.. పులివెందుల నియోజకవర్గ పరధిలో ఏకగ్రీవాలతో పాటుగా పులివెందుల మున్సిపాల్టీని సొంతం చేసుకొనేందకు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

 స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
TDP Unveils New Strategy amid Jagan Finalizes Candidate for pulivenudla local body election

ఇక్కడ ఎన్నికల కోసం మంత్రుల క‌మిటీని ఏర్పాటు చేశారు. వైసీపీ అసంతృప్తులు.. బ‌ల‌మైన నాయ‌కుల‌ ను కూడా చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. పులివెందుల కేంద్రంగా బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాం భూపాల్ రెడ్డికి ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయించారు. గత ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ గెలుపు కు రివేంజ్ గా ఈ సారి పులివెందుల లో టీడీపీ గెలవాలని పట్టుదలతో అడుగులు వేస్తోంది.

కాగా, కూటమి వ్యూహం అర్దం చేసుకున్న జగన్.. స్థానిక ఎన్నికల పైన తాజా పర్యటన వేళ స్థానిక నతేలతో చర్చలు చేసారు. పులివెందుల అభ్యర్దిని ఫిక్స్ చేసారు. యువ నేత చవ్వా దుష్యంత్‌రెడ్డి బరిలోకి దిగటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దుష్యంత్ గతంలో జమ్మలమడుగు, కమలాపురం లో పార్టీ కోసం పని చేసారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత నుంచి పులివెందుల కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.

 స్థానిక ఎన్నికల ముహూర్తం ఫిక్స్,కూటమి సీట్ల షేరింగ్ - మంత్రులకు బిగ్ టాస్క్..!!
స్థానిక ఎన్నికల ముహూర్తం ఫిక్స్,కూటమి సీట్ల షేరింగ్ - మంత్రులకు బిగ్ టాస్క్..!!

పులివెందులలో మనోహర్ రెడ్డికి మూడు దశాబ్దాలుగా స్థానిక ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. మనోహర్ రెడ్డితో కలిసి దుష్యంత్ రెండేళ్ల కాలంగా ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలకు.. ప్రజలకు అందుబాటులో ఉంటుండటంతో ఈ హోరా హోరీ ఎన్నికల్లో అభ్యర్దిగా బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు. అన్ని రకాలుగా వైసీపీని పులివెందులలో అష్టదిగ్భంధనం చేస్తున్న టీడీపీ.. ఇటు గెలుపు కోసం వైసీపీ కొత్త నిర్ణయాలతో.. ఇక్కడ ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+