AP Cabinet: చాలా కాలం తర్వాత కేబినెట్ కు పవన్ ..! చంద్రబాబుతో ఉత్సాహంగా..!

ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య తరచుగా కేబినెట్ భేటీలకు గైర్హాజరు కావడం, సీఎం చంద్రబాబు హాజరవుతున్న ప్రధాన కార్యక్రమాలకు కూడా రాకుండా దూరంగా ఉండిపోతుండటంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతి సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత హాజరయ్యారు. అంతే కాదు సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా కనిపించారు. దీంతో రూమర్లకు చెక్ పడింది.

ఇటుకలు అమ్మి 3 నెలల్లో 4 లక్షలు ..! ముచ్చటపడ్డ చంద్రబాబు..!
ఇటుకలు అమ్మి 3 నెలల్లో 4 లక్షలు ..! ముచ్చటపడ్డ చంద్రబాబు..!

ఈ మధ్యే ముంబై, కేరళ వెళ్లి వరుసగా చికిత్సలు చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజులుగా పిఠాపురం పర్యటనలో ఉన్నారు. ఇది ముగించుకుని ఇవాళ ఉదయం అమరావతిలో కేబినెట్ భేటీకి (AP Cabinet Meet) హాజరయ్యారు. ఓవైపు స్దానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, అంతకు ముందే కేబినెట్ భేటీలకు రాకుండా దూరంగా ఉండిపోవడంతో జరుగుతున్న చర్చకు ఇవాళ ఆయన చెక్ పెట్టారు.

Pawan Kalyan Attends AP Cabinet Meet Meets Chandrababu Amid Political Rumours
జనసేన వాటాపై తేల్చేసిన పవన్ ..! మళ్లీ 100% స్ట్రైక్ రేట్ వెనుక ?
జనసేన వాటాపై తేల్చేసిన పవన్ ..! మళ్లీ 100% స్ట్రైక్ రేట్ వెనుక ?

కేబినెట్ భేటీ కోసం సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ .. సీఎం చంద్రబాబుతో (Chandrababu) కలిసి మంత్రివర్గ సమావేశం జరిగే ఛాంబర్ కు వచ్చారు. దారిలో ఇద్దరూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా కాలం తర్వాత పవన్ రావడంతో ఆయన ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం కేబినెట్ భేటీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ తన సీట్లో కూర్చున్నారు. తర్వాత కేబినెట్ భేటీ యథావిధిగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు సహజంగానే కూటమి పార్టీలతో పాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+