జనసేన వాటాపై తేల్చేసిన పవన్ ..! మళ్లీ 100% స్ట్రైక్ రేట్ వెనుక ?

ఏపీలో స్థానిక సంస్థలకు రంగం సిద్దం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం.. పార్టీల మధ్య సీట్ల పంపకాలపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే జనసేన మాత్రం గత కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికల తరహాలో సీట్లు ఇస్తే సరిపోదని, అప్పటితే పోలిస్తే తాము రాష్ట్రంలో బలపడ్డామని చెబుతూ వస్తోంది. అయినా బలం ఉన్న చోట పోటీ చేస్తే సరిపోతుందని, కూటమి అవసరం ఏంటని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. దీంతో ఈసారి జనసేన పోటీ చేసే సీట్ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఓవైపు సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య చర్చలు సాగుతున్న వేళ ఈ గందరగోళం అంతా ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా కాకినాడలో ఏర్పాటు చేసిన పార్టీ భేటీలో క్లారిటీ ఇచ్చేశారు.

వైసీపీ శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!
వైసీపీ శాప్ ముట్టడిపై ఏపీ సర్కార్ సీరియస్..! పోలీసులకు కీలక ఆదేశాలు..!

గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము కూటమిలో భాగంగా ఉన్నందున 21 సీట్లలో పోటీకి అంగీకరించడమే కాకుండా, అన్నింట్లోనూ తమను గెలిపించాలని టీడీపీకి షరతు పెట్టింది. దీంతో తాము చెప్పిన సీట్లకు అంగీకరించిన జనసేనను పోటీ చేసిన 21 సీట్లలోనూ టీడీపీ మద్దతు ఇచ్చి గెలిపించుకుంది. తద్వారా 100 శాతం స్ట్రైక్ రైట్ సాధించేలా చేసింది. దీన్ని ఇప్పటికే తమ ఘనతగానే చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. తాజాగా కాకినాడ భేటీలోనూ దీన్ని స్ధానిక ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని క్యాడర్, నేతలకు పిలుపునిచ్చారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గెలిచే సీట్లే తీసుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ ను రిపీట్ చేద్దామని వారికి చెప్పకనే చెప్పేశారు.

Pawan Kalyan Gives Clues on NDA Seat Sharing Urges Jana Sena Cadre to Target 100 Strike Rate
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!
ఊరికే డైలాగులు- మీకు మీరే సర్టిఫికెట్లు..! దమ్ముంటే..? జగన్ ట్వీట్..!

ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కీలక కార్పోరేషన్లు, మున్సిపాలిటీలపై కన్నేసిన జనసేన.. ఆ మేరకు టీడీపీతో తెరవెనుక చర్చలు జరుపుతోంది. ఇందులో ఏ మేరకు పురోగతి ఉందన్న అంశంపై ఏ పార్టీ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. ఇలాంటి సమయంలో 100 శాతం స్ట్రైక్ రేట్ రిపీట్ చేయాలన్న పవన్ కళ్యాణ్ పిలుపును చూస్తే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే టీడీపీ ఇచ్చిన సీట్లు తీసుకుని, వాటిలో కచ్చితంగా గెలిచేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అదే జరిగితే రాష్ట్రంలో పలు కీలక ప్రాంతాల్లో పదవులపై జనసేన పెట్టుకున్న ఆశలు నెరవేరడం కష్టమేనన్న భావన వ్యక్తమవుతోంది. అయితే సీట్ల పంపకాలపై కూటమి వైపు నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ దీనిపై పూర్తి క్లారిటీ రాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+