మీకు ఒరిగేదేమీ ఉండదు..: ఐరాసలో సింధూ జలాలపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్

సింధూ జలాల ఒప్పందానికి సంబంధించిన వివాదాస్పద అంశాలపై పాకిస్తాన్ సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఒప్పందానికి అనుబంధంగా ఉన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పును సాకుగా చూపుతూ పాకిస్తాన్ తాజాగా విడుదల చేసిన లేఖపై విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తన దురుద్దేశపూర్వక ప్రచారంలో భాగంగా వాస్తవాలను వక్రీకరిస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తోందని తిప్పికొట్టింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై మాట్లాడారు. సింధూ జలాల ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏర్పాటైందని, దీన్ని తాము ఎప్పుడూ గుర్తించలేదని అన్నారు. ఏనాడూ దాని విచారణ ప్రక్రియలో కూడా పాల్గొనలేదని పేర్కొన్నారు. దేశ సార్వభౌమ నిర్ణయాలపై చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఈ కోర్టుకు ఎలాంటి పరిధి లేదని, అలాగే ఆగస్టు 31న ఈ కోర్టు ఇచ్చిన తీర్పు భారత్‌కు వర్తించదని స్పష్టం చేశారు.

India hit out at Pakistan over its circulation of a letter to UNSC as CoA linked Indus Waters Treaty

సింధూ జలాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి నిర్దేశిత ద్వైపాక్షిక మార్గాలు ఉన్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు. వాటిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి ఏకపక్షంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లడం సింధూ జలాల ఒప్పంద నిబంధనల ఉల్లంఘనే అవుతుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని రాజకీయాల కోసం వాడుకుంటూ పాకిస్తాన్ చేస్తోన్న ఈ తరహా ప్రయత్నాలు తప్పుదోవ పట్టించడానికేనని, దీనివల్ల ఒరిగేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు.

క్యాండీ క్రష్ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ క్యాజువల్ గేమ్స్: ఎక్స్‌బాక్స్ లో భారీ పునర్వ్యవస్థీకరణ
క్యాండీ క్రష్ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ క్యాజువల్ గేమ్స్: ఎక్స్‌బాక్స్ లో భారీ పునర్వ్యవస్థీకరణ

పాకిస్తాన్ ప్రోత్సాహిత సరిహద్దు ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితిలో భారత్ గట్టిగా నిలదీసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని త్కాలికంగా నిలిపివేశామని గుర్తు చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా స్వస్తి పలికే వరకు ఈ ఒప్పందం అబెయన్స్ లోనే ఉంటుందని జైస్వాల్ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు ప్రచారం చేయడం ఆపాలని, ఉగ్రవాద మూలాలపై చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లల్లో బీఫ్ వడ్డింపునకు ప్లాన్?
తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్లల్లో బీఫ్ వడ్డింపునకు ప్లాన్?

1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం.. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు. సాగునీటి అవసరాల కోసం పాకిస్తాన్ ఈ జలాలపైనే ఆధారపడుతోంది. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+