ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్, అతి భారీ వర్షాలు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రతమతమైంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. ఇవాళ రాత్రికి తీవ్రవాయు గుండంగా విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సమయంలో అతి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. దీంతో.. సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసారు.

ఏపీలో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలతో పాటుగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. క్రిష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చ రిక జారీ చేసింది. దీంతో.. భారీ వర్షాల పైన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సిఎస్, డీజీపీతో పాటు ఆయా శాఖల అధికారులు, మంత్రులతో సిఎం సమీక్షలో పాల్గొన్నారు.

చేసిన త్యాగాలు చాలు, వెనక్కు తగ్గేది లేదు - పవన్..!!
చేసిన త్యాగాలు చాలు, వెనక్కు తగ్గేది లేదు - పవన్..!!
cm-chandra-babu-made-clear-directions-for-officials-over-imd-latest-alerts-on-heavy-rains-here-the

అధికారులకు దిాశా నిర్దేశం

తుఫాను ఈరోజు మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం-కవిటి మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపిన అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వివరించారు. తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని వివరించారు. 24, 25వ తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించారు. 261 మండలాల్లో 129 మండలాలకు భారీ వర్షం, 121 మండలాల్లో సాధారణ వర్షం, 9 మండలాలకు అతి భారీ వర్షం, 2 మండలాలకు తీవ్ర వర్షం అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకల్లో ఆకస్మిక ప్రవాహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు.. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+