జులై నెలలో కింగ్ పిన్స్ ఈ రాశులే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, నక్షత్ర పరివర్తనాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా 2026 జూలై 4వ తేదీన అంతరిక్షంలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. సంపద, వైభవానికి కారకుడైన శుక్రుడు కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే, అప్పటికే సింహ రాశిలో ఛాయా గ్రహమైన కేతువు సంచరిస్తుంటాడు. దీనికి తోడు, అదే రోజున కేతువు ఆశ్లేష నక్షత్రాన్ని వీడి, తన స్వంత నక్షత్రమైన మాఘ నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు.

కేతువు నీడలోకి శుక్రుడు రావడం, తన స్వనక్షత్రంలో కేతువు బలం పుంజుకోవడం వల్ల విశ్వంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ అరుదైన 'శుక్ర-కేతువుల కలయిక' వల్ల 4 రాశుల వారికి ఇక తిరుగుండదు. జూలై నెల నుంచి వీరి అదృష్టం మామూలుగా ఉండదు. ఆ అదృష్ట రాశుల వివరాలు తెలుసుకుందాం.

ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
Horoscope Venus Ketu Conjunction- These Zodiac Signs Are Set to Shine This July

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం పూర్తిగా అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు, అక్కడ ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలం. విదేశీ వనరులు లేదా విదేశీ ఒప్పందాల ద్వారా భారీ లాభాలు చేకూరుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వారసత్వ ఆస్తి కలిసిరావడం లేదా పాత కోర్టు వివాదాలు పరిష్కారం కావడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవుతారు.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ గ్రహాల కలయిక అద్భుతమైన యోగాన్ని తీసుకొస్తోంది. మీ మాటతీరు సమాజంలో మీ గౌరవ మర్యాదలను, ప్రభావాన్ని విపరీతంగా పెంచుతుంది. మీ మాటతోనే పనులను సాధించుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి.
ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడం వల్ల కెరీర్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?

మేష రాశి

మేష రాశి వారికి ఈ కాలం ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. కార్యాలయంలో మీరు వేసే ప్రణాళికలు, వ్యూహాలు నూటికి నూరు శాతం విజయవంతం అవుతాయి.రైటింగ్, ఆర్ట్స్, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి సమాజంలో ఊహించని గుర్తింపుతో పాటు పెద్ద ప్రాజెక్టులు దక్కుతాయి. గతంలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లు, షేర్ మార్కెట్ లేదా ఇతర వనరుల ద్వారా ఆకస్మికంగా భారీ ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

తులా రాశి

తులా రాశి ఉద్యోగస్తులకు ఈ గ్రహాల మార్పు ఒక వరం లాంటిది. ఆఫీసులో మీ కష్టానికి తగ్గ సరైన ప్రతిఫలం లభిస్తుంది. మీ పనితీరుకు ముగ్ధులైన ఉన్నతాధికారులు మీకు ప్రమోషన్ లేదా జీతం పెంపు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పాత బకాయిలు, చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి. సమాజంలో పేరున్న, ప్రతీక కలిగిన పెద్దల సపోర్ట్ మీకు లభిస్తుంది. దీనివల్ల కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. శుక్ర, కేతువుల ఈ అరుదైన కలయిక ఈ నాలుగు రాశుల వారికి జూలై నెల నుంచి ఆర్థికంగా, వృత్తిపరంగా రాజయోగాన్ని ప్రసాదించబోతోంది. మీ రాశి ఇందులో ఉంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+