ఇరాన్ నౌకలో చైనా సరుకు- ఉలిక్కిపడ్డ అమెరికా
ఇరాన్ కు చెందిన ఎంవీ తౌస్కా కంటైనర్ షిప్ ను అమెరికా స్వాధీనం చేసుకున్న అనంతరం అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. దీని ప్రభావం ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన చర్చలపైనా పడుతుననాయి. ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయి. ఒమన్ గల్ఫ్‌లో ఈ నౌకను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న ఈ నౌకలో చైనాకు చెందిన కొన్ని రకాల పదార్థాలు అక్రమంగా తరలిస్తోందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇది అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్ కు పరోక్షంగా చైనా సహకరిస్తోందనే వాదనలు తలెత్తాయి.
దీనిపై రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా నావికా దిగ్బంధనం తర్వాత చైనా నుండి వచ్చిన తొలి నౌక ఇరాన్ క్షిపణుల రసాయనాలను మోసుకెళుతుందని ఆమె పేర్కొన్నారు. ఇది విస్మరించకూడదని సూచించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అమెరికా పట్టుకున్న నౌక చైనా నుండి ఇరాన్‌కు వెళుతోందని, క్షిపణుల రసాయన తయారీకి ఉద్దేశించిన కెమికల్స్ ఇందులో ఉన్నాయని తెలిపారు.

ఇరాన్ కు చైనా పరోక్షంగా సహాయాన్ని అందిస్తోందని, దీనికి తాజా ఉదాహరణ ఇదేనని చెప్పారు. తమ దేశానికి వ్యతిరేకంగా చైనా.. ఇరాన్ ను ఎగదోస్తోందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మరోవంక.. తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని ఇరాన్ తప్పు పట్టింది. దీన్ని సాయుధ దోపిడీగా అభివర్ణించింది. అమెరికా చర్యలకు ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.
ఇస్లామాబాద్ చర్చలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని ప్రభావం చర్చలపై పడొచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. తమ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేసేంతవరకు ఇస్లామాబాద్‌లో అమెరికాతో రెండో రౌండ్ చర్చలకు హాజరుకాబోమని ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అంటోన్నారు. దిగ్బంధనం విషయంలో వెనక్కి తగ్గబోనని, ఒప్పందం కుదిరిన తర్వాతే దీన్ని తొలగిస్తానని తేల్చి చెప్పారు.
The ship the U.S. seized in the Strait of Hormuz this weekend was headed from China to Iran and is linked to chemical shipments for missiles.
— Nikki Haley (@NikkiHaley) April 20, 2026
It refused repeated orders to stop.
Another reminder that China is helping prop up Iran’s regime—a reality that can’t be ignored.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఒమన్ గల్ఫ్‌లో స్వాధీనం చేసుకున్న ఈ ఎంవీ తౌస్కా షిప్.. తరచుగా చైనా రాకపోకలు సాగిస్తుంటుంది. దీనిపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం కోసం రసాయనాలు రవాణా చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో ఈ నౌక రెండుసార్లు చైనాను సందర్శించిందని డేటా అనలిటిక్స్ కంపెనీ సిన్మాక్స్ ఉపగ్రహ ఫొటోల ద్వారా తేలింది. ఇందులో ఉన్న సరుకు ఏమిటనేది తెలియట్లేదు.












Click it and Unblock the Notifications