ఖమేనీ అంత్యక్రియలకు నితిన్ నబిన్, ఖర్గే లకూ ఆహ్వానం.. వెళ్లేది ఎవరంటే..?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 3 నుంచి జూలై 9 వరకు ఇరాన్ తో పాటు మరికొన్ని నగరాల్లో జరగనున్నాయి. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు హాజరు కానున్నారు. ప్రపంచదేశాల నుంచి దాదాపు 2 కోట్ల మంది హాజరు కావచ్చని తెలుస్తోంది. అయితే ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలంటూ ఇరాన్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ గైర్హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రామానికి ప్రధాని మోదీ తరఫున బిహార్ గవర్నర్ సయిద్ అతా హస్నైన్ అలాగే మంత్రి పబిత్రా మార్గెరిటా హాజరు కానున్నట్లు సమాచారం.
అయితే ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలంటూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం అందుతోంది. జూలై 4 న మార్గెరిటా, హస్నైన్ భారత్ తరఫున హాజరుకానున్నట్లు స్పష్టం అవుతోంది. భారత్ కాకుండా చైనా, రష్యా, పాకిస్థాన్, ఖతార్ నుంచి కూడా అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. మరోవైపు ఇరాన్ మీడియా ఇదే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఇస్లాం స్కూల్ ను పాటించే అందరూ ఈ అంత్యక్రియల్లో ఫ్రీగా పాల్గొనచ్చని తెలిపింది. ఇరాన్ పై ఆసక్తి ఉన్నవాళ్లు కూడా ఈ కార్యక్రమానికి రావచ్చని పేర్కొంది.
వారం రోజుల పాటు జరగనున్న ఖమేనీ అంత్యక్రియలకు దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలోనే అతిపెద్ద అంత్యక్రియల కార్యక్రమంగా నిలవనుంది. మరోవైపు ఇదివరకే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో సంభాషించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాల నేతలు చర్చించారు.

అయితే సమస్యలను ఎప్పుడూ చర్చలు, దౌత్య పరంగానే పరిష్కరించుకోవాలని భారత్ ఎల్లప్పుడూ ఈ విధానానికే కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాంతీయ సవాళ్లు, సమస్యలను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం అవసరమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications