పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.. ఆరు చరణాల ‘వందేమాతరం’ మారుమోగింది

పార్లమెంట్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. వర్షాకాల సమావేశాల చివరి రోజున లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు తొలిసారిగా 'వందేమాతరం' జాతీయ గేయాలాపనతో ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల ఎంపీలంతా సభలో ఉండగా.. ఈ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర హోంశాఖ కొత్తగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆరు చరణాల వందేమాతరం గేయాన్ని ఆలపించిన అనంతరం, స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

జాతీయ గీతంతో సమానంగా చట్టభద్రత!

తాజాగా పార్లమెంట్ ఆమోదించిన చట్టంతోనే ఈ మార్పు చోటుచేసుకుంది. 'జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026'కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే ఆమోదముద్ర వేశారు. దీంతో ఇప్పటివరకు 'జనగణమన' జాతీయ గీతానికి ఉన్న ప్రాధాన్యత, చట్టపరమైన రక్షణ ఇకపై 'వందేమాతరం' జాతీయ గేయానికి కూడా లభించనుంది. అధికారిక కార్యక్రమాలు, రాష్ట్రపతుల రాక, త్రివర్ణ పతాకావిష్కరణ సమయాల్లో ఈ ఆరు చరణాల గేయాన్ని ప్లే చేయడం తప్పనిసరి చేశారు. ఈ ఆలపనకు ఎవరైనా కావాలని అంతరాయం కలిగించినా లేదా అవమానించినా అది శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా కఠిన నిబంధనలు తెచ్చారు.

Historic First In Parliament Full Vande Mataram Anthem Opens Lok Sabha Session On Final Day In 2026
ఎర్రకోటపై మార్మోగనున్న వందేమాతరం! 150 ఏళ్ల పండగ వేళ దేశ చరిత్రలో తొలిసారి
ఎర్రకోటపై మార్మోగనున్న వందేమాతరం! 150 ఏళ్ల పండగ వేళ దేశ చరిత్రలో తొలిసారి

గోల గోలగా సాగిన వర్షాకాల సమావేశాలు!

జులై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు మొదటి నుంచీ వివాదాలు, రచ్చల నడుమ సాగాయి. నీట్ పేపర్ లీక్ ఉదంతంలో విద్యార్థులపై జరిగిన పోలీసు లాఠీఛార్జ్, రామ్‌మందిర్ విరాళాల వ్యవహారం వంటి అనేక రాజకీయ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిరసనల హోరుతో పలుమార్లు ఉభయ సభలు వాయిదా పడుతూ వచ్చాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విద్యార్థుల అంశంపై సుదీర్ఘ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, విపక్షాల నిరసనలు మాత్రం తగ్గలేదు.

Vande Mataram: రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా మారిన కొత్త బిల్లు! జనగణమనతో సమానంగా ..
Vande Mataram: రాష్ట్రపతి ఆమోదం, చట్టంగా మారిన కొత్త బిల్లు! జనగణమనతో సమానంగా ..

మకర్‌ద్వార్ దగ్గర నేతల ధర్నాలు.. సభ నిరవధిక వాయిదా!

చివరి రోజు కూడా పార్లమెంట్ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. మకర్‌ద్వార్ వద్ద బిజెపి, విపక్ష నేతలు పోటీపోటీగా నిరసనలకు దిగారు. జార్ఖండ్‌లో జరుగుతున్న ఆందోళనలపై కాంగ్రెస్ తీరును ఎండగడుతూ అధికార పక్షం నినాదాలు చేయగా.. విద్యార్థుల సమస్యలపై ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని రీ సౌండ్ ఇచ్చాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నడుమే లోక్‌సభ చివరిరోజు వందేమాతరంతో ప్రారంభమై, ఆ వెంటనే వర్షాకాల సమావేశాల ముగింపును ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+