షుగరు బాధితులు భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఊహించని ప్రయోజనాలు..!!
ప్రస్తుత కాలంలో షుగరు బాధితుల సంఖ్య పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి.. ఇతర సమస్య ల కారణంగా షుగరు వ్యాధి వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. షుగరు వచ్చిన తరువాత మందులతో పాటుగా జీవన విధానంలోనూ మార్పులు అవసరం. అదే సమయంలో ఒత్తిడి తగ్గిస్తూ.. శారీరక వ్యాయామం చేయటం ద్వారా షుగరు నియంత్రణలో ఉంటుంది. అయితే, భోజనం చేసిన తరువాత పది నిమిషాలు కేటాయిస్తే షుగరు కంట్రోల్ లో ఉంచుకొనే జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసిన తరువాత చాలా మంది విశ్రాంతి తీసుకోవటం.. లేదా విధుల్లో మునిగిపోవటం చేస్తూ ఉంటారు. భోజనం అనంతరం 10 నుంచి 15 నిమిషాలు నడవాలని వారు సూచిస్తున్నారు. అలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగరు బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేసిన తర్వాత కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి రక్తంలోకి చేరడంతో షుగర్ స్థాయిలు సహజంగానే పెరుగుతాయి. ఈ సమయంలో కండరాలను కదిలించడం వల్ల అవి రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. దీంతో భోజనం తర్వాత వచ్చే షుగర్ పెరుగుదలను తగ్గించడంలో ఈ చిన్న నడక మేలు చేస్తుంది. భోజనం తర్వాత తరచూ వచ్చే అధిక షుగర్ పెరుగుదలను తగ్గించడం రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు ఉపయోగపడుతుంది.

నిపుణుల సూచనలు
అందుకే భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం డయాబెటిస్ ఉన్నవారికి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో ప్రసరించి.. చక్కెర పరిమాణాన్ని నియంత్రించడానికి సహాయ పడుతుంది. గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో ఈ నడక ప్రభావవంతంగా పని చేస్తోందని పరిశోధనల్లో కూడా తేలింది. నడవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భోజనం తర్వాత తక్కువ వేగంతో నడవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. దీంతో పాటుగా గుండెకు మేలు చేస్తోంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె నాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెను బలోపేతం చేస్తోంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. భోజనం తర్వాత నడక వల్ల మంచి నిద్ర.. మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications