'Viswanath & Sons' Twitter review: బొమ్మ బ్లాక్ బస్టర్.. సూర్య ఖాతాలో భారీ హిట్టు..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల 'కరుప్పు' సినిమాతో భారీ విజయం సాధించారు. అంతకుముందు ప్లాఫ్స్ లో ఉన్న హీరో కరుప్పు తెలుగులో వీరభద్రుడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. కరుప్పు సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాథ్ & సన్స్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. 'విశ్వనాథ్ & సన్స్' మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ మూవీలో సూర్య సరసన మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. వీరితోపాటు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు నటించారు. అయితే ఈ మూవీకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సర్, లక్కీ భాస్కర్ లాంటి క్లాసికల్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ మూవీని కూడా అదే స్టైల్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మూవీలో సూర్య సంజయ్ విశ్వనాథ్ గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 'విశ్వనాథ్ & సన్స్' మూవీలో సూర్య క్యారెక్టరైజేషన్ గజిని సినిమాలో సంజయ్ రామస్వామిని గుర్తు చేస్తుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
'విశ్వనాథ్ & సన్స్' సినిమా ఫస్టాఫ్ లో సూర్య, రాధిక, మమిత బైజు మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా బాగా వర్క్ అవుట్ అయింది. హీరోయిన్ మమిత బైజు ఈ మూవీలో చాలా ఫ్రెష్ గా, యాక్టివ్ గా కనిపించింది. తన క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. ఇక మూవీ సెకండాఫ్ లో అత్తారింటికి దారేది, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలను గుర్తు చేసే ఎమోషన్స్ తో దర్శకుడు కథలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

దర్శకుడు వెంకీ అట్లూరి గత సినిమాల్లో మాదిరిగానే విశ్వనాథ్ & సన్స్ మూవీలోనూ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. మూవీ చూసిన ప్రేక్షకులు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదే నని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి రేటింగ్ 3.75/5 ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications