శ్రావణ మాసంలో శ్రీశైలం వచ్చే భక్తులకు బిగ్ అలర్ట్ - కీలక మార్పులు..!!
శ్రీశైల క్షేత్రంలో శ్రావణమాసోత్సవాలు ఆరంభం అయ్యాయి. ఈ రోజు (ఆగస్టు 13) నుంచి సెప్టెంబర్ 12 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర మాసంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఆర్జిత సేవల్లో కొన్ని కీలక మార్పులు చేసారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్జిత సేవల విషయంలో మార్పుల పైన స్పష్టత ఇచ్చారు.
శ్రీశైలం ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేసింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక, గర్భాలయ అభిషేకాలు, కుంకుమా ర్చనలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. భక్తులు స్వామివారి దర్శనం మరియు పూజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా.. శని, ఆది, సోమవారాల్లో ఈ సేవలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మూడు రోజుల్లో కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పరిమితంగా స్పర్శ దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఉత్సవాల సందర్భంగా క్యూలైన్లలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు
అలాగే, శ్రావణ మాసంలోని 2, 3, 4వ శుక్రవారాల్లో భక్తుల కోసం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు. మహిళలు ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు అని ఆలయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టు 18, సెప్టెంబర్ 1 మరియు 8 తేదీలలో ఉదయం వేళల్లో గర్భాలయ అభిషేకాలు నిర్వహించబడవని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా, దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. ఈ నెలలో సెలవులు ఎక్కువగా ఉండటంతో.. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. రద్దీకి అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications