భారత్ లో పిట్ట కూయదు.. గుడి గంటలు మోగవు: పాకిస్థాన్ సంచలన వార్నింగ్

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లోయలో పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో భారత్ లోని 25 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాకిస్థాన్ పై ప్రతీకారంతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అంతేకాక పాకిస్థాన్ పై అనేక విధాలుగా ఆంక్షలు విధించింది. ఇరు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల పంపిణీని నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ లోని ఓ బహిరంగ కార్యక్రమంలో ఉగ్రవాదులతో ఆయన వేదిక పంచుకున్నారు. లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తాను హఫీజ్ సయ్యద్ సేవకుడిని అని బహిరంగంగానే తెలిపారు. సయ్యద్ ఫోన్ నెంబర్ తన మొబైల్ లో ఉన్న కారణంగా తనను అమెరికా నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోనే భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ వైపు చూస్తే భారత్ ను అల్లా నాశనం చేస్తాడని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియోలో పాకిస్థాన్ మాజీ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఎల్ఈటీ ఉగ్రవాదులతో స్టేజీ పంచుకున్నారు. పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్(PMML), ఖలీద్ మసూద్ సంధూ, మరో ఉగ్రవాది క్వారీ మహమ్మద్ యాకూబ్ షేక్ లు ఉన్నారు. ఈ సమావేశంలో రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. తాను హఫీజ్ సయ్యద్ కు గులామ్ ను అని అన్నారు. హఫీజ్ సయ్యద్ ఫోన్ నెంబర్ తన మొబైల్ లో ఉన్న కారణంగా అమెరికా నుంచి తనను గెంటేశారని తెలిపారు. అంతేకాక భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు.

Pakistan Former Interior Minister Sheikh Rashid Ahmed shares stage terrorists issues threats India

పాకిస్థాన్ వైపు చూస్తే భారత్ ను అల్లా నాశనం చేస్తాడని ప్రగల్భాలు పలికారు. భారత్ లో పక్షి ఎగరదు.. గుడిలో గంటలు మోగవు అని సంచలన వార్నింగ్ చేశారు. భారత్ లో యాంటీ పాకిస్థానీ కార్యకలాపాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాము పాకిస్థాన్ కు.. హఫీజ్ సయ్యద్ కు అండగా ఉన్నామని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ మాజీ హోంమంత్రి రషీద్ సయ్యద్ 2020 నుంచి 2022 వరకు ప్రభుత్వంలో కొనసాగారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్ సాన్ తో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. రషీద్ అహ్మద్.. భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారే కాదు గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+