సగం భూగోళం చీకట్లో..: స్టన్నింగ్ వీడియోలు
ఖగోళ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చిన అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అర్ధగోళంలోని పలు దేశాల్లో అద్భుత దృశ్యాలను ఆవిష్కరించింది. ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు యూరప్ వ్యాప్తంగా లక్షలాది మంది ఆసక్తి చూపించారు. మెయిన్ ల్యాండ్ యూరప్ పరిధిలో సుమారు 1999 తర్వాత మళ్లీ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ గ్రహణానికి చారిత్రక ప్రాధాన్యత ఏర్పడింది.
గ్రహణ నీడ ప్రయాణ మార్గంలో ప్రధానంగా ఉత్తర ధృవం ప్రాంతం నుంచి ప్రారంభమై అట్లాంటిక్ మీదుగా సాగింది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, రష్యా, స్పెయిన్, పోర్చుగల్‌లోని పలు ప్రాంతాల మీదుగా సూర్యుడి నీడ పయనించింది. ఈ ప్రాంతాల్లోని వీక్షకులు టొటాలిటీ తిలకించారు. యూరప్‌లోని మిగిలిన దేశాలతో పాటు వాయువ్య ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఈశాన్య ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం సంభవించింది.

అట్లాంటిక్ తీర ప్రాంతాలు స్పెయిన్, పశ్చిమ యూరప్ దేశాల్లో గ్రహణం వేళ వింత వాతావరణం నెలకొంది. అక్కడ సూర్యుడు అస్తమించే సమయంలోనే గ్రహణం కూడా సంభవించడంతో ఆకాశం వింత కాంతుల్లో మెరిసిపోయింది. కాషాయం, ముదురు ఎరుపు రంగులతో నిండిపోయింది. అస్తమిస్తోన్న సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేసే సమయంలో కనిపించిన సన్‌సెట్ ఎక్లిప్స్ దృశ్యం మైమరిపించింది. ఈ అద్భుత దృశ్యాలను క్లిక్ మనిపించడానికి అనేకమంది ఫోటోగ్రాఫర్లు అక్కడకు చేరుకున్నారు.
Amir Tsarfati:
— SuzcoolTT (@SuzcoolTT) August 13, 2026
"Tarragona, Spain, just went dark in the middle of the day.
Total solar eclipse." pic.twitter.com/1sHHg9h5KR
సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడి నీడ గరిష్టంగా 2:18 సెకన్ల పాటు సూర్యుడిని పూర్తిగా కమ్మేసింది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఆయా నగరాల్లో పగటిపూటే రాత్రి వేళను తలపించేలా చీకట్లు అలుముకున్నాయి. దీంతో పక్షులు తమ గూళ్లకు చేరుకోవడం కనిపించింది. పగటి ఉష్ణోగ్రత సైతం ఒక్కసారిగా పడిపోయింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1999లో సంభవించిన సంపూర్ణ గ్రహణ జ్ఞాపకాలను ఈ వింత మరోసారి గుర్తుచేసింది.
A total solar eclipse might look like from inside an airplane, thousands of feet above the Earth 🌍. pic.twitter.com/qMSV1dHYYR
— Stellarix (@Stellarixorine) August 13, 2026
భారత్ లో ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం దక్కలేదు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి సమయం కావడం వల్ల గ్రహణాన్ని తిలకించలేకపోయారు. దీంతో చాలామంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారానే ఈ ఖగోళ వింతను తిలకించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ గ్రహణ వీడియోలు విస్తృతంగా షేర్ అయ్యాయి. సూర్యుడి వెలుపలి వాతావరణ పొర కరోనాను అధ్యయనం చేయడానికి ఈ సూర్యగ్రహణం వీలు కల్పించింది.
Spanish skateboarder Danny Leon performed a trick during a total solar eclipse.#eclipse pic.twitter.com/DXripTF2na
— RRN (@R_R_N_ews) August 13, 2026
సాధారణ రోజుల్లో సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి వల్ల ఈ కరోనా భాగం మన కంటికి కనిపించదు. సంపూర్ణ గ్రహణం వేళ సూర్య బింబాన్ని చంద్రుడు పూర్తిగా మూసివేసినప్పుడు మాత్రమే దీన్ని స్పష్టంగా చూడొచ్చు. గ్రహణ సమయంలో సేకరించిన సమాచారం సహాయంతో అంతరిక్ష వాతావరణం, సౌర తుఫానులు, భూమిపై వాటి ప్రభావాల గురించి ఆరా తీస్తోన్నారు సైంటిస్టులు.













Click it and Unblock the Notifications