Cookie Stuffing: బిల్‌గేట్స్ కూతురికి 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?

ప్రపంచ బిలియనీర్ బిల్‌గేట్స్ కుమార్తె ఫిబీ గేట్స్ స్థాపించిన ఒక టెక్ కామర్స్ సంస్థ ఇప్పుడు తీవ్రమైన సైబర్ మోసం ఆరోపణల్లో చిక్కుకుంది. కేవలం టెక్నాలజీ సమస్య అని తోసిపుచ్చేందుకు ప్రయత్నించిన ఈ వ్యవహారం వెనుక, వినియోగదారులకు తెలియకుండానే కోట్లాది రూపాయల కమీషన్లను నొక్కేసిన పెద్ద ప్లాన్ ఉందనే వార్త పశ్చిమ దేశాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా చట్టాల ప్రకారం ఈ నేరం నిరూపితమైతే ఏకంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండటంతో, బిల్‌గేట్స్ కుటుంబం ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

'కుకీ స్టఫింగ్'.. అసలేమిటీ డిజిటల్ దొంగతనం?

ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో డిస్కౌంట్ కూపన్లు వెతికి ఇచ్చే సాఫ్ట్‌వేర్‌గా 'ఫియా (Phia)' అనే యాప్‌ను ఫిబీ గేట్స్ తన ఫ్రెండ్‌తో కలిసి ప్రారంభించారు. సాధారణంగా మనం ఆన్‌లైన్ లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఈ యాప్ డిస్కౌంట్ ఇస్తే, సదరు ఈ-కామర్స్ సైట్ ఈ యాప్‌కు కొంత కమీషన్ ఇస్తుంది. దీన్ని గుర్తించడానికి సిస్టమ్‌లో ఒక చిన్న డిజిటల్ ఫైల్ (కుకీ) ల్యాండ్ అవుతుంది. అయితే, అసలు ఈ యాప్ వల్ల ఎలాంటి డిస్కౌంట్ రాకపోయినా, వినియోగదారుడు కూపన్ వాడకపోయినా సరే.. సీక్రెట్‌గా వారి బ్రౌజర్‌లో 'కుకీ'లను జొప్పించి (స్టఫింగ్ చేసి), ఆ షాపింగ్ అంతా తమ వల్లే జరిగిందని సదరు ఈ-కామర్స్ సైట్లను మోసం చేసి ఫియా సంస్థ కోట్ల రూపాయల కమీషన్లు కాజేసింది. దీన్నే టెక్ ప్రపంచంలో 'కుకీ స్టఫింగ్' అంటారు.

What Is Cookie Stuffing Phoebe Gates Startup Phia Accused of Fraud and Facing 20 Year Prison Term

'సాంకేతిక లోపం' అన్నారు.. తీగ లాగితే డొంకంతా కదిలింది!

ఈ ఏడాది జులైలో ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు, ఈది తమ సాఫ్ట్‌వేర్‌లో దొర్లిన ఒక చిన్న గ్లిచ్ అని ఫియా యాప్ యాజమాన్యం ప్రకటించింది. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన అంతర్గత దర్యాప్తు వివరాలు పూర్తిగా వేరే కథను చెబుతున్నాయి. గత ఏడు నెలలుగా ఈ దొంగతనం జరుగుతోందని, అది కూడా ప్రమోటర్లకు తెలిసే జరుగుతోందని సీక్రెట్ మెసేజ్‌లు నిరూపిస్తున్నాయి.

అవును ముగ్గురితో అఫైర్...! బిల్ గేట్స్ సంచలనం-ఎప్ స్టీన్ బ్లాక్ మెయిల్ పైనా..!
అవును ముగ్గురితో అఫైర్...! బిల్ గేట్స్ సంచలనం-ఎప్ స్టీన్ బ్లాక్ మెయిల్ పైనా..!

ప్రముఖ బ్రాండ్లు నైకీ, గ్యాప్, నోర్డ్‌స్ట్రోమ్ వంటి పెద్ద సంస్థల కొనుగోలుదారుల డేటాను టార్గెట్ చేస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. జులైలో ఈ ఆటోమాటిక్ ఫీచర్‌ను బంద్ చేయగానే, కంపెనీకి రోజుకు వస్తున్న రూ. 67 లక్షల ఆదాయం ఒక్కసారిగా రూ. 8 లక్షలకు పడిపోవడం గమనార్హం. అంటే వీరికి వచ్చిన ఆదాయంలో సగానికి పైగా మోసపూరితంగా వచ్చిందే!

సొంత కాళ్లపై నిలబడాలనే ఆత్రంలో.. దొరికిపోయిన చాట్ హిస్టరీ!

తండ్రి ఇమేజ్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఎదుగుతానని చెప్పే 23 ఏళ్ల ఫిబీ గేట్స్, కంపెనీకి తగినంత కమీషన్లు రావడం లేదని ఆందోళన చెందుతూ రాసిన మెసేజ్‌లు లీక్ అయ్యాయి.

"కంపెనీ ఆన్‌లైన్ వ్యాపారం మొత్తం నుంచి మనకు పైసలు రావాలి, ఆటో కుకీ డ్రాప్ సిస్టమ్ అన్ని సైట్లలో పని చేస్తోందో లేదో చెక్ చేయండి" అంటూ ఆమె అంతర్గత చాట్‌లో రాసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

అంతటితో ఆగకుండా, వినియోగదారులు యాప్ నోటిఫికేషన్‌ను క్లోజ్ చేసినా సరే, వారి బ్రౌజర్‌లో దొంగతనంగా కుకీ వేయాలని మరో కో-ఫౌండర్ ప్రతిపాదించగా, గూగుల్ నిబంధనలు దానికి అంగీకరించవని టెక్ టీమ్ స్పష్టం చేసింది.

బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్!
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్!

చట్టం ఉక్కుపాదం.. బిల్‌గేట్స్ వారసురాలికి బిగ్ షాక్!

అమెరికా చట్టాల ప్రకారం ఈ 'కుకీ స్టఫింగ్'ను తీవ్రమైన వైర్ ఫ్రాడ్ గా పరిగణిస్తారు. చట్టపరమైన విశ్లేషకుల ప్రకారం ఈ నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యాప్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌లు రద్దు చేసుకున్నాయి.

సెలబ్రిటీల నుంచి సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడులు సేకరించిన ఈ స్టార్టప్, ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. మోసపోయిన బ్రాండ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని, నిబంధనలు పాటించడానికి కొత్త అధికారిని నియమిస్తున్నామని కంపెనీ సర్దుబాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, న్యాయపరమైన ఉచ్చు మాత్రం బిగుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+