బండి భగీరథ్ పోక్సో కేసులో షాకింగ్ పరిణామం.. బాధితురాలికి కోర్టు నోటీసులు!

తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరధ్ పోక్సో కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటివరకు బండి భగీరధ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, తాజాగా కేసు ఊహించని మలుపు తిరిగింది. నేడు హైకోర్టులో బండి భగీరథ్ పోక్సో కేసు సంబంధిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.

బాధితురాలి వాదనలు కూడా వినాలని నోటీసులు

రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ అప్పీల్‌ను విచారించిన కోర్టు బాధితురాలి వాదనలు కూడా వినాలని నిర్ణయించి ఆమెకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. బండి భగీరథ్ తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, తాను ఎలాంటి నేరం చేయలేదని హైకోర్టుకు విన్నవించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని కోర్టుకు విన్నవించారు.

Bandi Bhageerath POCSO case HighCourt issues notice to victim in Bhageerath case bail petition

కోర్టు బాధితురాలి వైపు నుంచి వాదనలు వినాలన్న కోర్టు

పోలీసుల దర్యాప్తుకు పూర్తి సహకరిస్తున్నానని, అందువల్ల తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే కోర్టు బాధితురాలి వైపు నుంచి వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు చేశారనే ఆరోపణలతో మే 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇప్పటికే బండి భగీరధ్ ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు

మే 16న అరెస్టు చేసిన బండి భగీరథ్‌ను చర్లపల్లి జైలులో రిమాండ్‌కు తరలించారు. ఇంజినీరింగ్ పరీక్షలు రాయడానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆయనను జూన్ 26న తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు కోసం మొయినాబాద్‌లోని అనన్య ఫామ్‌హౌస్‌లో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. డిసెంబర్ 31న అక్కడ జరిగిన ఘటనలపై బండి భగీరథ్‌ను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

ఖమ్మం-విజయవాడ (NH-163G) గ్రీన్‌ఫీల్డ్ హైవే.. ఆ ప్రాంతాలకు మహర్దశ!
ఖమ్మం-విజయవాడ (NH-163G) గ్రీన్‌ఫీల్డ్ హైవే.. ఆ ప్రాంతాలకు మహర్దశ!

కోర్టు నిర్ణయంపై అందరికీ ఆసక్తి

సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు, వీడియోలు వైరల్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్లపై కూడా వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాధితురాలి వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది జూలై 3న తేలనుంది. రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+