హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో సింహాల జీవన విధానం

నేడు.. వరల్డ్ లయన్ డే. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీని ప్రపంచ సింహాల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సింహాలు.. ప్రత్యేకించి అరుదైన ఆసియాటిక్ లయన్ తో పాటు ఇతర వన్యప్రాణుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని తీసుకుని రావడం దీని ముఖ్య ఉద్దేశం. భారత్ లో వరల్డ్ లయన్ డే ను జరుపుకొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జులాజికల్ పార్క్ లల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

జూపార్క్ లల్లో సింహాల సంరక్షణ ఎలా ఉంటుంది, వాటి రోజువారీ అలవాట్లు ఏమిటనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో కూడా శనివారం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక సదస్సులో జూ సిబ్బంది, యానిమల్ కీపర్లు నేరుగా సందర్శకులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆసియా, ఆఫ్రికా జాతి సింహాల జీవన విధానం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వారితో పంచుకున్నారు.

Inside the Nehru Zoological Park Lions Program Ahead of World Lion Day Keepers Explain Daily Big Cat Care

సింహాల రోజువారీ సంరక్షణ ఎంత సవాల్ తో కూడుకున్నదో సందర్శకులకు వివరించారు యానిమల్ కీపర్లు. అడవుల్లో స్వేచ్ఛగా విహరించే సింహాలను జూ వాతావరణంలో ఉంచడం అనేది అత్యంత సవాల్ తో కూడుకున్నదని తెలిపారు. వాటికి ఆహారాన్ని అందించే విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు., వాటిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం నిరంతర ప్రక్రియగా అభివర్ణించారు.

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ టికెట్ రేట్లు అద్దిరిపోయాయ్: వ్లాగర్లకు మరీనూ !!
హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ టికెట్ రేట్లు అద్దిరిపోయాయ్: వ్లాగర్లకు మరీనూ !!

సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్ల వంటి వన్యప్రాణులకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, వీటికి ఏటా ఫెలైన్ డిస్టెంపర్ వ్యాక్సిన్‌ను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అందిస్తామని చెప్పారు. జూ రికార్డుల ప్రకారం ప్రతి ఏటా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను క్రమం తప్పకుండా చేపడుతుంటామని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింహాల ప్రాముఖ్యతను వివరించారు.

నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా..: సీఎం రేవంత్ రెడ్డి రాక
నాగార్జున సాగర్ లో వైభవోపేతంగా..: సీఎం రేవంత్ రెడ్డి రాక

అంతరించిపోతున్న ఈ వన్యప్రాణుల జాతులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని అధికారులు గుర్తుచేశారు. సింహాల సంతానోత్పత్తి, వాటి శారీరక దృఢత్వాన్ని పర్యవేక్షించడం కూడా యానిమల్ కీపర్ల ప్రధాన విధుల్లో భాగమే. రోజువారీగా వాటి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, ఏవైనా అనారోగ్య లక్షణాలు లేదా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే మెడికల్ టీమ్ ను అప్రమత్తం చేస్తారు.

అమరావతి శ్రీవారి ఆలయంలో మూడు షిఫ్టుల్లో
అమరావతి శ్రీవారి ఆలయంలో మూడు షిఫ్టుల్లో

జూపార్క్ లో ప్రధాన ఆకర్షణ.. లయన్ సఫారీ. దీని విస్తీర్ణం.. సుమారు 40 ఎకరాలు. 1974లోనే ప్రజల సందర్శనార్థం దీన్ని తెరిచారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా లయన్ సఫారీ ఏర్పాటైంది ఇక్కడే. స్వేచ్ఛగా తిరిగే సింహాలను చాలా దగ్గరగా చూసే అద్భుతమైన అనుభవాన్ని ఈ సఫారీ కల్పిస్తుంది. పచ్చని చెట్ల మధ్య సింహాలు స్వేచ్ఛగా తిరుగుతుంటే వాటిని సురక్షితంగా వీక్షించేందుకు నగరవాసులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+