పాకిస్థాన్ గుప్పిట్లోకి అరేబియా సముద్రం..! రంగంలోకి భారత్.. సీక్రెట్ వెపన్ తో..
భారత్ సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటున్న సంగతి తెలిసిందే. సరిహద్దులోనే కాదు.. సముద్ర గర్భంలోనూ యుద్ధానికి కాలు దువ్వుతోంది పాకిస్థాన్. తాజాగా మరోసారి అరేబియా సముద్రంలో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతేడాది ఇదే నెలలో అంటే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పినప్పటికీ ఎలాగైనా మరోసారి భారత్ ను అస్థిరపరచాలని, రెచ్చగొట్టాలని పాకిస్థాన్ తన కుట్రలను ప్రదర్శిస్తోంది.
ఇటీవలికాలంలో అరేబియా సముద్రం వేదికగా భారత్- పాకిస్థాన్ మధ్య క్షిపణి పరీక్షలు వేగవంతం అవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా మరోసారి నోటీస్ టు మెరైనర్స్ (NOTMAR) ను జారీ చేసింది పాకిస్థాన్. ఏప్రిల్ నెలలో ఈ నోటమ్ జారీ చేయడం ఇది మూడోసారి. పాకిస్థాన్ మూడో క్షిపణి పరీక్షకు సంబంధించిన నోటమ్ ఇది. ఈ పరీక్ష ఏప్రిల్ 29-29 తేదీల్లో జరగనుంది. పాకిస్థాన్ లోని కీలక నగరం అయిన కరాచీకి 200 కిలోమీటర్ల దూరంలో ఓర్మానా, గ్వదర్ వైపు విస్తరించి ఉన్న ప్రాంతంలో పాకిస్థాన్ ఈ మిసైల్ పరీక్షలను చేపట్టనుంది.
గతంలో ఇదే నెలలో రెండు క్షిపణుల పరీక్షలను పాకిస్థాన్ చేపట్టింది. పాకిస్థాన్ నేవీ చీఫ్ అడ్మైరల్ నవీద్ అష్రఫ్ నేతృత్వంలో SMASH యాంటీ- షిప్ బాలిస్టిక్ మిసైల్ పరీక్షను విజయవంతంగా పరీక్షించింది పాకిస్థాన్. అయితే పాకిస్థాన్ కదలికలను పసిగట్టిన భారత్.. అరేబియా సముద్రంలోని పశ్చిమ తీరంలో భారీ నోటమ్ జోన్లను ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 27 నుంచి ఏప్రిల్ 30 వరకు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక తీరాలకు సమీపంలో భారత్ యుద్ధ విన్యాసాలను చేపట్టింది.

అలాగే తీర ప్రాంతంలో గస్తీ నిర్వహించేందుకు, పాకిస్థాన్ మిసైల్ ప్రయోగాలను పర్యవేక్షించేందుకు భారత్.. అత్యాధునిక మిసైల్ ట్రాకింగ్, నిఘా నౌక అయిన ఐఎన్ఎస్ ధ్రువ్ ను రంగంలోకి దింపింది. అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ ధ్రువ్ ఒక ఫ్లోటింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఈ నౌక పాకిస్థాన్ క్షిపణుల వేగం, మార్గం అలాగే వాటి పనితీరును నిశితంగా అంచనా వేయగలదు. అయితే ఐఎన్ఎస్ ధ్రువ్ కు పోటీగా పీఎన్ఎస్ రిజ్వాన్ ను రంగంలోకి దింపింది పాకిస్థాన్. దాంతో అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications