వంట నూనె ధరలు భారీగా పెరుగుదల..!!

వంట నూనె ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఒక వైపు పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు.. మరో వైపు నిత్యవసరాలకు తోడుగా కూరగాయల ధరలు ఒక్క సారిగా పెరిగాయి. ఈ సమయంలోనే పెరుగుతున్న వంట నూనె ధరలు సామాన్యులకు సమస్య గా మారింది. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిఘా పూర్తి స్థాయిలో లేకపోవటం వినియోగదారులకు భారాన్ని పెంచుతోంది. నెల రోజుల కాలంలో పెరిగిన ధరలు మోయలేని భారంగా మారుతున్నాయి.

వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. ఒకే సారి లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22 శాతం పెరిగింది. పలు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వంట నూనెల ధరలు పరిశీలిస్తే సన్‌ప్లవర్‌ ఆయిల్‌ రూ. 180 నుంచి రూ. 200, పామాయిల్‌ రూ. 120 నుంచి రూ. 145, వేరు శనగ నూనె రూ. 15 నుంచి రూ.20 కు చేరింది. 5 కిలోల డబ్బా రూ.1000 నుంచి రూ. 1150లకు, 15 కిలోల టిన్ను ('హోల్‌సేల్‌) రూ. 2300 నుంచి రూ. 2400 వరకు పెరిగింది. అదే విధంగా రైస్‌ బ్రౌన్‌ నూనె ధర లీటర్‌ రూ. 150 నుంచి రూ. 165లకు పెరిగింది. వనస్పతి అయిల్‌ లీటరు రూ. 130 నుంచి రూ. 160, సోయాబీన్స్‌ ఆయిల్‌ రూ. 150 నుంచి రూ. 170కి చేరింది. ఆవ నూనే రూ .130 నుంచి రూ. 160కి చేరింది. వంట నూనేల ధరలు ఇలా పెరగటం సామాన్యులకు భారంగా భారింది. ఇప్పటికే పెరిగిన వంట గ్యాస్ ధరలు... రోజు రోజుకీ పెరుగుతున్న కూరగాయల ధరలతో వంట నూనెల ధరలు పెరగటం మరింత సమస్యగా మారుతోంది.

విజయ్ కు అధికారం ఖాయమా..? లెక్క మారింది అక్కడే, ఐపీఎస్ సంచలన రిపోర్ట్..!!
విజయ్ కు అధికారం ఖాయమా..? లెక్క మారింది అక్కడే, ఐపీఎస్ సంచలన రిపోర్ట్..!!
cooking-oil-prices-witnessing-a-sharp-surge-over-the-past-month-as-market-repots

వ్యాపారుల పై కొరవడిన నిఘా

కాగా, పలువురు ధరల కారణంగా సన్ ఫ్లవర్ వినియోగం తగ్గించి రైస్‌బ్రాన్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌ వైపు మళ్లుతున్నారు. ఇవి సన్‌ప్లవర్‌ ఆయిల్‌ కన్నా రూ. 10 నుండి రూ 20 వరకు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రిఫైన్డ్‌, సన్‌ప్లవర్‌ ఆయిల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో నూనెల ధరలు పెరిగాయని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. మనకు అవసరమైన సన్‌ప్లవర్‌ ఆయిల్‌ ఎక్కువ భాగం ఉక్రేయిన్‌, రష్యాల నుంచి దిగుమతి అవుతుంది. యుద్ధం సద్దుమణిగి సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప నూనెల ధరల మంటలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే అదును గా భావిస్తున్న కొందరు వంట నూనెకు అసలు అమ్మకం ధర కంపెనీ బ్రాండెడ్‌ను బట్టి రూ. 750 నుంచి రూ.960 వరకు ఉండగా ఎమ్మార్పీని మాత్రం అధికంగా రూ. .1118లుగా ముద్రించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+