విజయ్ కు అధికారం ఖాయమా..? లెక్క మారింది అక్కడే, ఐపీఎస్ సంచలన రిపోర్ట్..!!

తమిళనాడులో విజయ్ కే అధికారం ఖాయమా. ఎగ్జిట్ పోల్స్ తో తమిళనాడులో అంచనాలు మారి పోతున్నాయి. మెజార్టీ సర్వే సంస్థలు డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పగా.. కొన్ని సంస్థ లు విజయ్ కే ప్రజలు పట్టం కట్టారని చెప్పుకొచ్చాయి. ఈ సమయంలోనే మరో ప్రముఖ సర్వే సంస్థ నియోజకవర్గాల వారీగా సర్వే ఫలితాలను వెల్లడించింది. విజయ్ వెనుక జనం ఎందుకు నిలిచారో విశ్లేషించింది. రెండు కూటములు.. విజయ్ కు దక్కే సీట్లు.. ఓట్ల లెక్కను వెల్లడించింది.

తమిళనాడు లో విజయ్ కే అధికారం ఖాయమని మరో సర్వే సంస్థ వెల్లడించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీ రవి టీం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రతీ నియోజకవర్గంలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వేలో గ్రామీణం.. పట్టణం అనేది తేడా లేకుండా యువత.. మహిళలు పెద్ద సంఖ్యలో విజయ్ కు పట్టం కట్టేందుకు ముందుకు వచ్చారని వివరించింది.

Vijay is projected to win 121 seats in the Tamil Nadu elections according to an exit poll survey by P Ravi

ఈ సర్వే ప్రకారం విజయ్ నాయకత్వంలోని టీవీకే 41 శాతం ఓటింగ్ తో 121 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రతీ నియోజకవర్గం లో ఎంపిక చేసిన టీం.. సామాజిక, ప్రాంతీయ లెక్కలతో ఈ సర్వే నిర్వహించింది. కాగా.. ఈ సర్వే లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-40 ఏళ్ల వయస్సు వారిలో TVK బలమైన మద్దతు ఇచ్చారని విశ్లేషించింది.

అయిదు దశాబ్దాలుగా ఉన్న డీఎంకే - అన్నా డీఎంకే కంటే యువత పెద్ద సంఖ్యలో కొత్తగా వచ్చిన విజయ్ వైపు నిలిచిందని చెప్పుకొచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలను విజయ్ టీం అధిగమించిందని వివరించింది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు వెల్లడించిన సర్వే సంస్థలు భిన్నా భిప్రాయాలు వ్యక్తం చేసాయి. మెజార్టీ సంస్థలు డీఎంకే తిరిగి అధికారంలో కొనసాగుతుందని చెప్పగా.. మరి కొన్ని అన్నాడీఎంకేకు అవకాశం ఉందని విశ్లేషించాయి.

యాక్సిస్ మై ఇండియా సంస్థ TVKకి 98-120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో.. విజయ్ అభిమానుల్లో జోష్ పెరిగింది. అటు డీఎంకే సైతం అలర్ట్ అయింది. అన్నా డీంఎకే అధికారంలోకి డీఎంకే రాకుండా ఉండేందుకు అవసరమైతే విజయ్ ను సీఎం చేసి.. మద్దతు ఇచ్చేందుకు సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. దీంతో.. ఇప్పుడు విజయ్ కేంద్రంగా.. తమిళనాడు ఫలితాల వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+