బీఆర్ఎస్ కు షాక్ .. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. రైతు సంగ్రామ సభ పేరుతొ హన్మకొండలో నిర్వహించిన సభలో ఆయన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పైన చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఆయనపై కేసు నమోదైంది.
వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సభ
తెలంగాణ రాజకీయాల్లో రైతు కేంద్రంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగుతుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు డిక్లరేషన్ లోని అంశాలను అమలు చెయ్యలేదని, రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని టార్గెట్ చేసి, రైతు వారోత్సవాల సమయంలో వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సభ నిర్వహించింది.

కేటీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది, ప్రతిగా ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హన్మకొండ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాదని, వ్యక్తిగత దూషణలకు పాల్పడటమేనని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం
అత్యున్నత రాజ్యాంగ, రాజకీయ పదవులు చేపట్టిన వ్యక్తులను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతరకరం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.కేటీఆర్ ప్రసంగంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో పాటు డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు, క్రిమినల్ కేసు నమోదు
వీరంతా కలిసి వరంగల్‌లోని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని దూషించడం సరికాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదును స్వీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. సీఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్‌పై బీఎన్ఎస్ 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఉద్దేశపూర్వకంగా అవమానించి శాంతికి భంగం కలిగించడం, అల్లర్లను ప్రోత్సహించడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చేశారని, కేటీఆర్ పై పై సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.













Click it and Unblock the Notifications