కవిత vs కేటీఆర్ – ఎవరి బలం ఎంత?

తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టి, ప్రజలలోకి దూకుడుగా వెళుతున్న కవిత పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కవితను ఎదుర్కోవడానికి కేటీఆర్ ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కవిత, కేటీఆర్ ఇద్దరు కీలక పాత్రధారులు.


కేటీఆర్, కవితలలో రాజకీయంగా ఎవరు తెలివైన వారు?

వారిద్దరూ ఒకే పార్టీలో ఉంటే ఆ పార్టీకి లాభం జరుగుతుంది. కానీ కవిత బిఆర్ఎస్ పార్టీ నుండి తనను సస్పెండ్ చేయడంతో కొత్త రాజకీయ పార్టీ పెట్టి కేటీఆర్ ను, కేసీఆర్ ను టార్గెట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ సమయంలో కేటీఆర్, కవితలలో ఎవరు తెలివైన వారు. రాజకీయంగా ఎవరి బలం ఏంటి? కవిత కేటీఆర్ లలో ఎవరి ప్రభావం ప్రజలపైన ఎక్కువగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Kavitha vs KTR A Comparative Analysis of Leadership Public Appeal and Political Strength of both

కేటీఆర్ బలం ఇదే

రాజకీయంగా కేటీఆర్, కవిత ఇద్దరు హేమాహేమీలే. కేటీఆర్ వ్యూహాత్మక రాజకీయాలలో ముందుంటారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాలనలో పాలసీలు, అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అనేక అంశాలలో పక్కా ప్లానింగ్ తో తనదైన మార్క్ చూపించారు. కేటీఆర్ నగర యువత, ఐటీ ప్రొఫెషనల్స్, మధ్యతరగతి వర్గాలలో మంచి ఇమేజ్ ను కలిగి ఉన్నారు.

స్ట్రాటజీలతో పనిచేసే నాయకుడు కేటీఆర్

స్పష్టమైన, లాజికల్ కమ్యూనికేషన్ తో ప్రజలను ఆకట్టుకోవడంలో ఆయన దిట్ట. మీడియాను, సోషల్ మీడియాను వినియోగించడంలో ముందు వరుసలో ఉండే నాయకుడు కేటీఆర్. పార్టీ లైన్లో పనిచేసే, సంక్లిష్ట పరిస్థితులలో స్ట్రాటజీ లతో పనిచేసే నాయకుడు కేటీఆర్.

భావోద్వేగంతోనే బలంగా కవిత

ఇక కవిత విషయానికి వస్తే కవిత భావోద్వేగ అనుబంధాన్ని బలంగా ఉపయోగించగలిగిన రాజకీయ నేత. ప్రజల సమస్యల పైన స్పందించడం, సాంస్కృతిక అంశాల ద్వారా కనెక్ట్ అవ్వడం కవిత కు ఉన్న ప్రత్యేకత. గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, సాంప్రదాయ వర్గాలలో ఎక్కువ ప్రభావం చూపించగల కవిత, క్షేత్రస్థాయిలో కి వెళ్లి ప్రజలతో కనెక్ట్ అవ్వ గలిగిన నేత.

కేంద్రం చెప్పిన తీపి కబురుకు ఉబ్బి తబ్బిబ్బైన సీఎం చంద్రబాబు
కేంద్రం చెప్పిన తీపి కబురుకు ఉబ్బి తబ్బిబ్బైన సీఎం చంద్రబాబు

పరిస్థితులకు తగ్గట్టు స్పందించే నేత కవిత

కవిత కమ్యూనికేషన్లో భావోద్వేగం ఉంటుంది. సాంస్కృతిక టచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రజలతో బలమైన అనుబంధాన్ని సృష్టించడానికి వీలవుతుంది. పరిస్థితులకు అనుగుణంగా, అవసరాన్ని బట్టి తన భావాలను ప్రతిబింబిస్తారు కవిత. ఇక ఇద్దరు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన లీడర్స్ కావడంతో భవిష్యత్తులో ఎవరి వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+