హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, ఫుల్ షెడ్యూల్ ఇదే!

తెలంగాణ గడ్డపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన (ఆదివారం) ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు వస్తుండటం ఇదే తొలిసారి కావడంతో, రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారు రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

PM Narendra Modi Hyderabad Tour Mega Schedule Out for Parade Grounds Rally and Smart City Launch Today

అభివృద్ధి పనుల జాతర..

మోదీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపనున్నారు.

  • జహీరాబాద్‌: ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన.
  • వరంగల్: పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్ పనులకు శ్రీకారం.
  • హైటెక్ సిటీ: సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, వైద్య నిపుణులతో ముఖాముఖి.
బోధ్‌గయ సాక్షిగా వియత్నాంతో చారిత్రక మైత్రి! మోదీ వ్యూహం ఇదే!
బోధ్‌గయ సాక్షిగా వియత్నాంతో చారిత్రక మైత్రి! మోదీ వ్యూహం ఇదే!

పరేడ్ గ్రౌండ్స్ లక్ష్యం.. 2 లక్షల మంది!

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, కాగజ్‌నగర్, పెద్దపల్లి నుంచి వచ్చే అభిమానుల కోసం 4 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. 3 వేల ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేశారు

 హైదరాబాద్ లో అమృత్ భారత్ స్టేషన్లు, ప్రధాని మోదీ ప్రారంభం- ముహూర్తం ఫిక్స్..!!
హైదరాబాద్ లో అమృత్ భారత్ స్టేషన్లు, ప్రధాని మోదీ ప్రారంభం- ముహూర్తం ఫిక్స్..!!

మోదీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ (మే 10):

  • మధ్యాహ్నం 1:10: బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం.
  • మధ్యాహ్నం 2:20: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 2:30 - 3:00: బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలోనే అధికారిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
  • మధ్యాహ్నం 3:15: హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి ప్రయాణం.
  • మధ్యాహ్నం 3:30 - 4:30: సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, వైద్యులతో భేటీ.
  • సాయంత్రం 4:40: తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • సాయంత్రం 5:30 - 6:30: రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని, భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
  • రాత్రి 6:45: పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తిరుగు ప్రయాణం.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించాయి. పీఎం పర్యటన దృష్ట్యా నగరంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+