హైదరాబాద్ లో అమృత్ భారత్ స్టేషన్లు, ప్రధాని మోదీ ప్రారంభం- ముహూర్తం ఫిక్స్..!!
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ పర్యటనలో రూ.8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ నూతన విభాగాలు, ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల ప్రారంభోత్సవం చేసే విధంగా కార్యక్రమం సిద్దం చేసారు. అదే సమయంలో హైదరాబాద్ నగరంలో రెండు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ పర్యటనలో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో బీబీనగర్ ఎయిమ్స్ నూతన విభాగాలు, ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల ప్రారంభోత్సవం చేసే విధంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిని మూడు కార్పోరేషన్లుగా విభజన చేసారు. వీటిల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా ఫిక్సం చేసింది.

హైదరాబాద్ పర్యటన వేళ
ఇక, హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, హఫీజ్ పేట స్టేషన్లతో పాటుగా 90 శాతం పూర్తయిన మల్కాజిగిరి, రాధాక్రిష్ణ నగర్ అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వీటిని కేంద్రం భారీ ఖర్చుతో... అధునాతన సదుపాయాలతో పూర్తి సౌకర్యవంతంగా తీర్చి దిద్దింది. ప్రధాని రాకతో పార్టీ కేడర్‌కు కొత్త జోష్ వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. 2 లక్షల మందిని సమీకరించాలని భావిస్తోంది. మోదీ సభ విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది.













Click it and Unblock the Notifications